Minor raped by father : ఆరేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం- భరించలేక మైనర్​ ఆత్మహత్య-manipur minor repeatedly raped by father dies by suicide say police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Minor Raped By Father : ఆరేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం- భరించలేక మైనర్​ ఆత్మహత్య

Minor raped by father : ఆరేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం- భరించలేక మైనర్​ ఆత్మహత్య

Sharath Chitturi HT Telugu
Aug 23, 2022 08:24 AM IST

Minor raped by father : మణిపూర్​లో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఆరేళ్లుగా తండ్రి అత్యాచారం చేస్తుంటే.. భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.

ఆరేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం- భరించలేక మైనర్​ ఆత్మహత్య
ఆరేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం- భరించలేక మైనర్​ ఆత్మహత్య (HT Telugu)

Minor raped by father : మణిపూర్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన కూతురిపై ఆరేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాధను భరించలేక.. 15ఏళ్లకే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది బాధితురాలు.

ఆరేళ్లుగా..

15ఏళ్ల బాలిక.. తన కుటుంబంతో కలిసి తౌబాల్​ జిల్లాలో జీవిస్తోంది. కాగా.. బాలికపై ఆమె తండ్రి గత ఆరేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు!

ఈ విషయాన్ని తన నాన్నమ్మకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది. కానీ ఆమె పట్టించుకోలేదు. కొడుకు తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలోనే.. పలువురు స్నేహితులతో తన పరిస్థితిని చెప్పుకుని బాధపడింది ఆ మైనర్​. అంతేకాకుండా.. ఓ డైరీలో తన బాధను రాసుకుంది!

తండ్రి అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువ అయిపోవడంతో ఆ బాలిక మానసికంగా కృంగిపోయింది. బోర్డింగ్​ స్కూల్​కు వెళతానని వేడుకున్నా.. తండ్రి ఒప్పుకోలేదు.

ఇక చివరికి.. జులై 31 సాయంత్రం ఆత్మహత్యకు బాధితురాలు పాల్పడింది.

Manipur rape case : ఆమెకు తీవ్ర గాయాలైనప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు! మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంది ఆ బాలిక. ఆమె పరిస్థితి విషమించడంతో.. చివరికి ఆమెను ఈ నెల 3వ తేదీన జేఎన్​ఐఎంఎస్​ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు చికిత్స చేసేందుకు ఆసుపత్రి వైద్యులు, నర్సులు తీవ్రంగా కృషిచేశారు. కానీ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరో ప్రైవేటు ఆసుపత్రికి సిఫార్సు చేశారు.

అక్కడే.. ఆ బాలిక స్టేట్​మెంట్​ను పోలీసులు రికార్డు చేశారు. నిందితుడిని ఆగస్టు 5న అరెస్ట్​ చేశారు. ఈ ఘటన మణిపూర్​లో కలకలం సృష్టించింది. నిందితుడి ఇంటిని నిరసనకారులు తగలబెట్టారు. బాలికకు న్యాయం జరగాలని డిమాండ్​ చేశారు.

మరోవైపు బాలిక ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నెల 18న.. మరో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తన పరిధిలో చేయగలిగినది అంతా చేస్తామని హామీనిచ్చారు. కాగా బాలిక డైరీని పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం