New variants of Corona Omicron: దేశంలో కోవిడ్ పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సమీక్షించారు. కొత్త సబ్ వేరియంట్లను దేశంలో గుర్తించడంతో, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో చర్చించారు.
ఈ సబ్ వేరియంట్ ను మొదట సింగపూర్ లో ఈ ఆగస్ట్ నెలలో గుర్తించారు. అక్కడ ఈ సబ్ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వేరియంట్ ఒమిక్రాన్ BA.2.75, BJ.1 సబ్ వేరియంట్ల హైబ్రిడ్ గా గుర్తించారు. భారత్ లో ఈ వేరియంట్ ను మహారాష్ట్ర, కేరళల్లో గుర్తించారు. ఈ వేరియంట్ ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోందని, అలాగే, వ్యక్తి రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది.
మహారాష్ట్రలో ఈ వేరియంట్ ను మొదట గుర్తించారు. గత వారం రోజుల్లో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17.7% పెరిగాయి. రానున్న పండుగ సీజన్ లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే ఒమిక్రాన్ BA.2.3.20 and BQ.1 వేరియంట్లను కూడా గుర్తించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మాస్కులు కచ్చితంగా ధరించేలా చూడాలని, కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. సంబంధిత నిబంధనలను అన్ని రాష్ట్రాలకు పంపనున్నారు. కొత్త వేరియంట్ల కారణంగా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న విషయంపై వారు చర్చించారు. వివిధదేశాల నుంచి వచ్చే ఎంట్రీ పాయింట్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.