Lovers killed : ప్రేమికులను చంపి.. బండరాళ్లకు కట్టి- మొసళ్లు ఉన్న నదిలో పడేసిన ‘పెద్దలు’!-lovers killed by womans family bodies found in crocodile infested river in mp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lovers Killed : ప్రేమికులను చంపి.. బండరాళ్లకు కట్టి- మొసళ్లు ఉన్న నదిలో పడేసిన ‘పెద్దలు’!

Lovers killed : ప్రేమికులను చంపి.. బండరాళ్లకు కట్టి- మొసళ్లు ఉన్న నదిలో పడేసిన ‘పెద్దలు’!

Sharath Chitturi HT Telugu
Jun 19, 2023 11:19 AM IST

Lovers killed in Madhya Pradesh : మధ్యప్రదేశ్​లో పరువు హత్య కలకలం రేపింది. అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు.. ప్రేమికులను చంపేశారు. అనంతరం మృతదేహాలను బండరాళ్లకు చుట్టి, మొసళ్లు ఎక్కువగా తిరిగే నదిలో పడేశారు!

ప్రేమికులను చంపి.. బండరాళ్లకు కట్టి- మొసళ్లు ఉన్న నదిలో పడేసి..!
ప్రేమికులను చంపి.. బండరాళ్లకు కట్టి- మొసళ్లు ఉన్న నదిలో పడేసి..!

Lovers killed in Madhya Pradesh : మధ్యప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మొసళ్లు అధికంగా ఉన్న నదిలో నుంచి.. బండరాళ్లకు కట్టేసి ఉన్న ప్రేమికుల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. అమ్మాయి కుటుంబసభ్యులే ఈ పరువు హత్యకు పాల్పడటం గమనార్హం.

ఇదీ జరిగింది..

మొరేనా జిల్లాలోని రతన్​బసై గ్రామానికి చెందిన 18ఏళ్ల శివాని తోమర్​.. పక్క గ్రామానికి చెందిన 21ఏళ్ల రాధేశ్యామ్​ తోమర్​లు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. రాధేశ్యామ్​ను మర్చిపోవాలని బెదిరించారు. కానీ ఆమె వారి మాటలను పట్టించుకోలేదు.

ఈ నెల 3న ప్రేమ జంట అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత.. రాధేశ్యామ్​ కనిపించడం లేదని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివాని కూడా అదృశ్యమైందని తెలిపాడు. వారిద్దరిని అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ప్రేమికులు పారిపోయి, పెళ్లి చేసుకుని ఉంటారని, తిరిగొచ్చేస్తారని పోలీసులు తొలుత భావించారు. కానీ రాధేశ్యామ్​ తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు. రెండు గ్రామాల్లోని కొంతమంది ప్రజలను విచారించారు. ప్రేమికులు పారిపోవడాన్ని.. వారెవ్వరు చూడకపోవడంతో పోలీసులకు అనుమానం పెరిగింది.

ఇదీ చూడండి:- Nalgonda Murder: నల్గొండలో పరువు హత్య.. బాలిక కోసం వచ్చిన బాలుడిని కొట్టి చంపేశారు…

ప్రేమించుకున్నారు.. చంపేశాము..

ఈ క్రమంలోనే శివాని తల్లిదండ్రులను విచారించారు. చివరికి వారు నిజాన్ని ఒప్పుకున్నారు!

"నా బిడ్డ మా మాట వినలేదు. అందుకే చంపేశాము. అతడిని కూడా చంపేశాము. జూన్​ 3న వారిని తుపాకితో కాల్చేశాము. మృతదేహాలను బండరాళ్లకు కట్టి, చంబల్​ నదిలో పడేశాము," అని కుటుంబసభ్యులు పోలీసుల వద్ద నిజాన్ని ఒప్పుకున్నారు.

ఇదొక పరువు హత్య అని తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పడేసిన నదులో 500కుపైగా మొసళ్లు, 2000కుపైగా ఆలిగేటర్లు (పెద్ద మొసళ్లు) ఉంటాయని అధికారులు తెలిపారు.

పరువు హత్యలు..

దేశంలో పరువు హత్యలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఓ మహిళ.. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. తన బంధువు, కొడవలితో ఆమె గొంతు కోసి చంపేసిన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో ఇటీవలే కలకలం సృష్టించింది.

పిసావన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బాజ్​నగర్​ గ్రామంలో గత నెలలో ఈ ఘటన జరిగింది. సంబంధిత మహిళ.. గతంలో తన మేనమామ ఇంట్లో నివాసముండేది. కాగా.. అదే గ్రామానికి చెందిన రూప్​ చంద్ర మౌర్యతో ఆమెకు కొన్నేళ్లుగా సంబంధం ఉంది. అయితే.. అతనికి అప్పటికే పెళ్లి జరిగింది. పైగా, అతనిది వేరే కులం.

UP Honour killing : ఈ వ్యవహారం తెలుసుకున్న మేనమామ శ్యాము సింగ్​.. మహిళను మందలించి, ఆమెను గతేడాది తన తండ్రి పుతాన్​ సింగ్​ తోమర్​ వద్దకు పంపించేశాడు. మహిళ.. ఘాజియాబాద్​లో ఉంటోందని తెలుసుకున్న రూప్​ చంద్ర మౌర్య.. కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్లాడు. వారిద్దరు కలిసి ప్లాన్​ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతేడాది నవంబర్​లో పెళ్లి చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం