KCR Maharashtra tour : రుక్మిణీ దేవీ ఆలయంలో కేసీఆర్ పూజలు..
KCR Maharashtra tour : మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. సోలాపూర్ రుక్మిణీ దేవీ ఆలయంలో పూజలు నిర్వహించారు కేసీఆర్. పలువురు ఎమ్మెల్యేలు సైతం ఆయనతో పాటు ఆలయానికి వెళ్లారు.
KCR Maharashtra tour : మహారాష్ట్ర పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సోలాపూర్ పండరిపూర్‌లోని శ్రీ విట్టల్ రుక్మిణీ దేవీ ఆలయాన్ని మంగళవారం ఉదయం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల ఆశీర్వాదాలు పొందారు. పలువురు మంత్రులు కూడా కేసీఆర్ వెంట ఆలయానికి వెళ్లారు.
అనంతరం పండరిపూర్ నుంచి సర్కోలికి కేసీఆర్ బృందం బయలుదేరింది. భగీరత్ బాల్కే ఆహ్వానం మేరకు.. ఆయన నివాసంలో మధ్యాహ్న భోజనం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత. అనంతరం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో.. మంత్రులతో సహా కేసీఆర్ పాల్గొనున్నారు.
ఇదీ చూడండి:- CM KCR : 600 వాహనాలతో భారీ కాన్వాయ్, మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ సినిమా స్టైల్ ఎంట్రీ!
రెండు రోజుల పర్యటనలో భాగంగా.. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర సోలాపూర్‌కు చేరుకున్నారు కేసీఆర్. ఈవాళ సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారు.
కేసీఆర్ ప్రభావం ఉండదు..
కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో.. ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్.
"మహారాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభావం ఏం ఉండదు. ఇలాంటి డ్రామాలు చేస్తే.. కేసీఆర్ తెలంగాణలోనూ ఓడిపోతారు. వాస్తవానికి.. ఓటమి భయంతోనే ఆయన మహారాష్ట్రకు వచ్చారు. ఆయన పార్టీకి చెందిన 12-13మంది సోమవారమే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్, కేసీఆర్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మాకు సంబంధం లేదు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ చాలా శక్తివంతంగా ఉంది," అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం