పాత వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీ పెంపుపై స్టే-karnataka hc stays centre s notification on higher fee and penalty on aged vehicles ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పాత వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీ పెంపుపై స్టే

పాత వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీ పెంపుపై స్టే

HT Telugu Desk HT Telugu
May 12, 2022 12:54 PM IST

15 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ రుసుమును పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది.

<p>కర్ణాటక హైకోర్టు</p>
కర్ణాటక హైకోర్టు (HT_PRINT)

బెంగళూరు, మే 12: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ పదిహేనేళ్ల వాహనాలపై రుసుములు, జరిమానాలను పెంచుతూ జారీ చేసిన నోటిఫికేషన్‌పై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. పెంచిన ఫీజు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం గత ఏడాది అక్టోబరు 4న ఈ నోటిఫికేషన్ జారీచేసింది. గతంలో కూడా ఇదే తరహా నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు 2017లో కొట్టివేసింది. 

‘ఇదే తరహా కేంద్రం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది..’ అని పిటిషనర్ నివేదించారు. ఈనేపథ్యంలో హైకోర్టు ఈ నివేదనను పరిగణనలోకి తీసుకుని ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ, అక్టోబరు 4, 2021 నాటి నోటిఫికేషన్‌పై తదుపరి విచారణ వరకు స్టే విధిస్తూ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది.

ప్రతివాదులు నోటీసుకు సమాధానం ఇచ్చిన తరువాత హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కర్ణాటక లారీ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టులో సవాలు చేసింది.

15 ఏళ్లు దాటిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలంటే ఇప్పటివరకు ఉన్న ఫీజు రూ. 600 కాగా.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రూ. 5 వేలు చెల్లించాలి. బైకుల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు గతంలో రూ. 300 ఉండగా, ఇప్పుడు రూ. 1000 చెల్లించాలి. 15 ఏళ్లు దాటిన బస్సులు, ట్రక్కుల ఫిట్ నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ కోసం ఫీ గతంలో రూ. 1,500 ఉండగా, ఇప్పుడు రూ. 12,500లకు పెంచారు. కమర్షియల్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఏటా తీసుకోవడం తప్పనిసరి. రెన్యువల్ సర్టిఫికెట్ తీసుకోవడంలో జాప్యం జరిగితే నెలకు రూ. 500 చెల్లించాలి.  అంతేకాకుండా సర్టిఫికెట్ ఎక్స్‌పైరీ అయ్యాక కొత్త సర్టిఫికెట్ తీసుకునేంతవరకు రోజుకు రూ. 50 చొప్పున జరిమాన చెల్లించాల్సి ఉంటుంది.

Whats_app_banner

టాపిక్