Jio 259 recharge plan | ఇక నెల రోజులపాటు వాలిడిటీ-jio launches rs 259 calendar month validity prepaid plan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jio 259 Recharge Plan | ఇక నెల రోజులపాటు వాలిడిటీ

Jio 259 recharge plan | ఇక నెల రోజులపాటు వాలిడిటీ

HT Telugu Desk HT Telugu
Mar 28, 2022 01:12 PM IST

ప్రీపెయిడ్ ఎప్పుడైపోతుందో అని పదే పదే తేదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది.

<p>మొబైల్ వినియోగదారుడు</p>
మొబైల్ వినియోగదారుడు (Bloomberg)

టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో రూ. 259 ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ప్రీపెయిడ్ వినియోగదారులు ప్రతి నెలా వేర్వేరుగా తమ రీఛార్జ్ తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా క్యాలెండర్ నెలను అనుసరించి వాలిడిటీ కలిగి ఉంటుంది. ఇలాంటి ప్లాన్ తెచ్చిన టెలికామ్ ఆపరేటర్లలో జియో మొదటిది.

జియో వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. రూ. 259 ప్లాన్ 1.5 GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఖచ్చితంగా ఒక క్యాలెండర్ నెల చెల్లుబాటుపై వస్తుంది. ఒక సంవత్సరంలో 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తే సరిపోతుంది.

ప్లాన్ ప్రతి నెలా అదే తేదీన పునరావృతమవుతుంది. ఉదాహరణకు ఒక వినియోగదారుడు కొత్త ప్లాన్‌లో భాగంగా రూ. 259 నెలవారీ ప్లాన్‌తో మార్చి 5న రీఛార్జ్ చేసుకుంటే, తదుపరి రీఛార్జ్ తేదీలు రాబోయే నెలల్లో ఐదో తేదీన (ఏప్రిల్ 5, మే 5, జూన్ 5, ఇలా..) ఉంటాయి.

ఒకవేళ గడువు తేదీ కంటే ముందుగా రీఛార్జీ చేసుకుంటే.. ముందున్న గడువు ముగియగానే కొత్త రీఛార్జీ యాక్టివేట్ అవుతుంది. 

ప్లాన్ అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొత్త, ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ 30 రోజుల చెల్లుబాటుతో ప్రీ-పెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని టెలికాం ఆపరేటర్లను కోరింది. ఒక సంవత్సరంలో కస్టమర్ చేసే రీఛార్జ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదం చేస్తుంది.

Whats_app_banner