Crime news : తండ్రి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగంపై తనయుడి కన్ను.. చివరికి!
Jharkhand Crime news : తండ్రి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగంపై తనయుడి కన్ను పడింది. ఆయన్ని చంపి.. ఉద్యోగం పొందాలని భావించాడు. చివరికి..
Jharkhand Crime news : ఝార్ఖండ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి చనిపోతే, ఆయన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం తనకు వస్తుందని భావించిన ఓ వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు! కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో తండ్రిని చంపేందుకు సిద్ధపడ్డాడు.
ఇదీ జరిగింది..
ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో జరిగింది ఈ ఘటన. స్థానికంగా నివాసముంటున్న రామ్‌జీ ముండా.. ఓ సీసీఎల్(సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్) ఉద్యోగి. అతనికి 25ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతని పేరు అమిత్ ముండా. కాగా.. తండ్రి చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగం మీద అమిత్ కన్ను పడింది.
కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ అయిన సీసీఎల్‌లో ఓ రూల్ ఉంది. సంస్థకు చెందిన ఏ శాశ్వత ఉద్యోగైనా.. రిటైర్మెంట్ కన్నా ముందు మరణించినా.. కాంపన్సేటరీ కింద.. అతనిపై ఆధారపడుతున్న వారిలో ఒకరికి, ఆ ఉద్యోగం వెళుతుంది. ఇది తెలుసుకున్న అమిత్.. సొంత తండ్రినే చంపేందుకు సిద్ధపడ్డాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ చేశాడు. ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ని హైర్ చేసుకున్నాడు.
ఈ నెల 16న.. రామ్‌గఢ్ జిల్లాలోని మట్కామా చౌక్ నడిరోడ్డు మీద, పట్టపగలు.. రామ్‌జీ ముండా హత్యకు గురయ్యాడు. కాంట్రాక్ట్ కిల్లర్లు అతడిపై తుపాకీలతో కాల్చి, అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రామ్‌జీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Murder for government job : మరోవైపు.. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు.
"రామ్‌జీ ముండాపై ఎవరు దాడి చేశారు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. అతని కుమారుడు అమిత్‌పై మాకు అనుమానం వచ్చింది. వెంటనే అతడిని విచారణకు పిలిపించాము. అతనే నిజాన్ని ఒప్పుకున్నాడు. తండ్రి చనిపోతే.. ప్రభుత్వం ఉద్యోగం తనికి వస్తుందన్న కారణంతో, ఆయన్ని చంపేందుకు ప్లాన్ చేసినట్టు వివరించాడు. ఈ పనిని కాంట్రాక్ట్ కిల్లర్స్‌కి అప్పగించినట్టు తెలిపాడు," అని పోలీసులు వివరిచారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం సొంత తండ్రినే చంపేందుకు సిద్ధపడిన 25ఏళ్ల అమిత్‌ని.. హత్యాయత్నం కింద అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కాంట్రాక్ట్ కిల్లర్స్‌ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
గతంలో కూడా.!
Son kills father for job : 2020లో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తాజా ఘటనలో రామ్‌జీ ముండాకు గాయాలవ్వగా.. నాటి ఘటనలో ఓ 55ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
సీసీఎల్ ఉద్యోగి అయిన ఆ 55ఏళ్ల వ్యక్తికి 25ఏళ్లు కుమారుడు ఉన్నాడు. అతడు నిరుద్యోగి. తండ్రి మరణిస్తే, ఆ ఉద్యోగం వస్తుందని భావించిన అతను.. తండ్రిని చంపాలని ఫిక్స్ అయ్యాడు. సీసీఎల్ వర్క్‌షాప్‌లోనే.. తండ్రి గొంతు కోసి హత్య చేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
సంబంధిత కథనం