Hindustan unilever q1 results 2023: హెచ్‌యూఎల్ నెట్ ప్రాఫిట్ 13.85 శాతం అప్-hul first quarter net profit rises 14 per cent to rs 2 391 crore ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hindustan Unilever Q1 Results 2023: హెచ్‌యూఎల్ నెట్ ప్రాఫిట్ 13.85 శాతం అప్

Hindustan unilever q1 results 2023: హెచ్‌యూఎల్ నెట్ ప్రాఫిట్ 13.85 శాతం అప్

HT Telugu Desk HT Telugu
Jul 20, 2022 12:15 PM IST

Hindustan unilever q1 results 2023: హిందుస్తాన్ యూనిలివర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

<p>హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ నికర లాభం 13.85 శాతం పెరిగింది</p>
హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ నికర లాభం 13.85 శాతం పెరిగింది (REUTERS)

ముంబై, జూలై 20: భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసిజి) కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.85 శాతం పెరిగి రూ.2,391 కోట్లకు చేరుకుంది.

జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19.46 శాతం పెరిగి రూ.14,331 కోట్లకు చేరుకుంది.

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు మంగళవారం జరిగిన సమావేశంలో జూన్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలను ఆమోదించింది. త్రైమాసికంలో టర్నోవర్ 19 శాతం పెరిగిందని హెచ్‌యూఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంతకుముందు ఎన్నడూ లేని ద్రవ్యోల్బణం ఎదురైనప్పటికీ ఎబిటా (EBITDA ) మార్జిన్ 23.2 శాతంగా ఉందని, పన్ను తర్వాత లాభం (PAT) 11 శాతం వృద్ధి చెందిందని కంపెనీ తెలిపింది.

ఫాబ్రిక్ వాష్, హౌస్‌హోల్డ్ కేర్‌లో బలమైన పనితీరుతో హోమ్ కేర్ సెగ్మెంట్ 30 శాతం వృద్ధిని అందించింది. లిక్విడ్‌, ఫ్యాబ్రిక్ సెన్సేషన్‌లు ప్రభావవంతమైన మార్కెట్ అభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన పనితీరును కొనసాగించాయి.

‘అధిక ద్రవ్యోల్బణం, వినియోగం సవాలుగా ఉన్న వాతావరణంలో బలమైన టాప్‌లైన్, బాటమ్-లైన్ పనితీరుతో మరో త్రైమాసికాన్ని అందించాం..’ అని హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా అన్నారు.

‘ఆరోగ్యకరమైన శ్రేణిలో మార్జిన్‌లను కొనసాగించడం ద్వారా మా వ్యాపార నమూనాను కాపాడుకుంటూ పోటీతత్వంతో అభివృద్ధి చెందాం. ద్రవ్యోల్బణం, సాధారణ రుతుపవనాల అంచనా, ప్రభుత్వం తీసుకున్న ద్రవ్య, ఆర్థిక చర్యలపై సమీప-కాల ఆందోళనలు ఉన్నాయి. అయితే భారతీయ ఎఫ్‌ఎంసిజి రంగానికి మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాలపై మేం నమ్మకంగా ఉన్నాం. స్థిరమైన, పోటీతత్వ, లాభదాయకమైన, బాధ్యతాయుతమైన వృద్ధిని అందించడంపై దృష్టి కేంద్రీకరించాం..’ అని మెహతా ఒక ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం