China Apps | 54 చైనా యాప్‌లపై నిషేధం-government may ban 54 chinese apps says report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China Apps | 54 చైనా యాప్‌లపై నిషేధం

China Apps | 54 చైనా యాప్‌లపై నిషేధం

HT Telugu Desk HT Telugu
Feb 14, 2022 11:15 AM IST

మరోసారి చైనా యాప్‌లపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి లిస్ట్‌లో 54 యాప్స్‌ ఉన్నాయి. వీటిలో 11 యాప్స్ పేర్లను ఇప్పటికే ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది.

<p>మరోసారి చైనా యాప్స్ పై కొరఢా ఝుళిపించనున్న ప్రభుత్వం</p>
మరోసారి చైనా యాప్స్ పై కొరఢా ఝుళిపించనున్న ప్రభుత్వం (Pexels )

న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు ఉందంటూ 54 చైనీస్‌ యాప్‌లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. వీటిలో చైనాకు చెందిన పెద్ద కంపెనీలైన టెన్సెంట్‌, అలీబాబా, నెట్‌ఈజ్‌ల యాప్స్‌ ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ ఒకటి వెల్లడించింది.

2020లో భారత ప్రభుత్వం నిషేధం విధించిన యాప్స్‌నే ఇవి రీ బ్రాండ్‌ చేసి తీసుకొచ్చాయి. నిషేధం విధించబోయే యాప్స్‌లో ఈ కిందివి ఉన్నట్లు న్యూస్‌ ఏజెన్సీ ANI తెలిపింది. 

Beauty Camera: Sweet Selfie HD, Beauty Camera - Selfie Camera, Equalizer & Bass Booster, CamCard for SalesForce Ent, Isoland 2: Ashes of Time Lite, Viva Video Editor, Tencent Xriver, Onmyoji Chess, Onmyoji Arena, AppLock and Dual Space Lite వంటి యాప్స్‌ ప్రభుత్వం నిషేధించింది. కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు పలు చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజా యాప్‌లతో కలిపి ఈ మొత్తం సంఖ్య 324కు చేరింది.

Whats_app_banner