బడ్జెట్ 2024: బీహార్‌కు రూ.26,000 కోట్లు, విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు
బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ పాలిత బీహార్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద పీట వేశారు.
నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించారు. బహుళపక్ష అభివృద్ధి సంస్థల సహాయం ద్వారా కేంద్ర ప్రభుత్వం బీహార్ కు ఆర్థిక సహాయం అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న జనతాదళ్ (యునైటెడ్) డిమాండ్ ను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరస్కరించిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి బీహార్‌లో వివిధ రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 26,000 కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.
బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ ప్రణాళికను రూపొందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ముఖ్యాంశాలు ఇవే
- రూ.21,400 కోట్ల వ్యయంతో పీర్ పాయింటి వద్ద 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టబడతాయి. -బీహార్ లో కొత్త విమానాశ్రయాలు , వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు.
- బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల నుంచి బాహ్య సహాయం కోసం బీహార్ ప్రభుత్వ అభ్యర్థనలను వేగవంతం చేస్తారు.
- గయాలో ఇండస్ట్రియల్ నోడ్: బీహార్ లోని గయ నగరాన్ని తూర్పు భారతదేశంలో పారిశ్రామిక నోడ్ గా అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
- పాట్నా - పూర్ణియా ఎక్స్‌ప్రెస్ వే, బక్సర్ - భాగల్పూర్ హైవే, బోధ్గయా - రాజ్గిర్ - వైశాలి - దర్భాంగా, బక్సర్లో గంగా నదిపై రూ. 26,000 కోట్లతో అదనపు రెండు వరుసల వంతెన అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తామని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పారు.
- ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
- టూరిజంలో భాగంగా టెంపుల్ కారిడార్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
- నలంద యూనివర్శిటీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.
టాపిక్