Caste-based census: బిహార్ లో కుల గణన(Caste-based census:) ప్రారంభమైంది. రాష్ట్రంలో కులాల వారీగా జనాభాను లెక్కించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 జిల్లాల్లో ఈ కుల గణనను రెండు దశల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బిహార్ లో తొలి దశ కులాలవారీ జనాభా లెక్కింపు జనవరి 7వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ వరకు జరుగుతుంది. పేదలకు అభివృద్ధి ప్రయోజనాలు అందించడానికి వీలుగా శాస్త్రీయ విధానాల ద్వారా కుల గణన (Caste-based census) చేపట్టినట్లు ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెలిపారు. పేదలకు బీజేపీ వ్యతిరేకమని, అందువల్ల ఈ కుల గణన జరగకుండా ఆపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. బీజేపీవి పేదల వ్యతిరేక విధానాలని ఆరోపించారు. శాస్త్రీయంగా రూపొందించిన కుల గణన (Caste-based census) నివేదిక ఆధారంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, తదనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని తేజస్వీ వివరించారు.
కుల గణన (Caste-based census) రెండో దశ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం ఈ ప్రక్రియను మే 31, 2023 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని కులాలు, ఉప కులాలు, వాటి జనాభా, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ కుల గణన ద్వారా గణించనున్నారు. రాష్ట్రంలో కుల గణన (Caste-based census) చేపట్టాలని గత సంవత్సరం జూన్ లో నిర్ణయించారు. జనగణనలో భాగంగా కుల గణన చేపట్టలేమని కేంద్రం స్పష్టం చేసిన తరువాత బిహార్ కేబినెట్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బిహార్ జనాభా సుమారు 12.70 కోట్లు. రాష్ట్రంలో సుమారు 2.58 కోట్ల కుటుంబాలున్నాయి.
టాపిక్