ప్రపంచంలో అత్యంత సంతోషంగా జీవించే దేశం ఏదో తెలుసా?-finland is world s happiest nation for fifth straight year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ప్రపంచంలో అత్యంత సంతోషంగా జీవించే దేశం ఏదో తెలుసా?

ప్రపంచంలో అత్యంత సంతోషంగా జీవించే దేశం ఏదో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Mar 18, 2022 06:03 PM IST

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాను విడుదల చేశారు. తొలి స్థానంలో ఏ దేశం ఉందంటే..

అత్యంత సంతోషంగా ఉండే దేశం ఏదంటే…
అత్యంత సంతోషంగా ఉండే దేశం ఏదంటే… (Hindustan times telugu)

World's Happiest Nation | ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంతోషంగా జీవించే దేశంగా ఐదోసారి ఫిన్​ల్యాండ్​ ఎంపికైంది. మరోవైపు అత్యల్ప సంతోషం కలిగిన దేశంగా అఫ్గానిస్థాన్​ నిలిచింది.

ఐక్యరాజ్య సమితి ప్రోత్సాహంతో గత పదేళ్ల నుంచి 'వరల్డ్​ హాపియెస్ట్​ కంట్రీ' నివేదికను రూపొందిస్తున్నారు. సంతోషం, ఆనందంపై ప్రజల వ్యక్తిగత అభిప్రాయాలు, ఆర్థిక- సామాజిక, జీడీపీ, సామాజిక సహాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయికి సంబంధించిన డేటాను పరిశీలించి ఈ నివేదికను రూపొందిస్తారు. 0-10 మధ్యలో, మూడేళ్ల కాలానికి సగటు తీసి ర్యాంకులు ఇస్తారు. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధానికి ముందే ఈ ఏడాది నివేదిక పూర్తయింది.

ఫిన్​ల్యాండ్​ టాప్​ సీటు దక్కించుకోగా.. డెన్​మార్క్​ రెండో స్థానంలో నిలిచింది. అనేక ఉత్తర యూరోప్​ దేశాలు తొలి 10 ర్యాంకుల్లో చోటుదక్కించుకోవడం విశేషం. అమెరికాకు 16, బ్రిటన్​కు 17, ఫ్రాన్స్​కు 20వ ర్యాంకు దక్కింది.

ఇక అత్యల్ప సంతోషకర దేశంగా అఫ్గానిస్థాన్​ అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. లెబనాన్​, వెనుజువెలాలు ఈసారి దారుణంగా పతనమయ్యాయి. ఆయా దేశాల్లో సంక్షోభం భారీ స్థాయిలో ఉండటం గమనార్హం.

ఈసారి.. కొవిడ్​ ముందు, తర్వాతి పరిస్థితుల్లో ప్రజల ఎమోషన్లపైనా అధ్యయనం జరిగింది. ఇందుకోసం సామాజిక మాధ్యమాన్ని వేదికగా పరిగణించారు. '18 దేశాల ప్రజల్లో ఒత్తిడి, బాధ పెరిగింది' అని అధ్యయనంలో బయటపడింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం