క్షుద్రపూజలు చేస్తున్నారని- మలం తినిపించి, మూత్రం తాగించి..-family forced to eat human excreta in jharkhand s dumka 6 arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  క్షుద్రపూజలు చేస్తున్నారని- మలం తినిపించి, మూత్రం తాగించి..

క్షుద్రపూజలు చేస్తున్నారని- మలం తినిపించి, మూత్రం తాగించి..

Sharath Chitturi HT Telugu
Sep 27, 2022 12:17 PM IST

Family forced to eat human excreta : ఆ కుటుంబంపై కొందరు దాడి చేశారు. క్షుద్రపూజలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఐరన్​ రాడ్​లతో కొట్టారు. మలాన్ని తినిపించి, మూత్రాన్ని తాగించారు. ఈ అమానవీయ ఘటన ఝార్ఖండ్​లో చోటుచేసుకుంది.

<p>క్షుద్రపూజలు చేస్తున్నారని.. మలం తినిపించి, మూత్రం తాగించి..</p>
క్షుద్రపూజలు చేస్తున్నారని.. మలం తినిపించి, మూత్రం తాగించి..

Family forced to eat human excreta : ఝార్ఖండ్​లో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. క్షుద్రపూజలు చేస్తున్నారు అన్న ఆరోపణలతో ఓ కుటుంబంపై పలువురు దాడి చేశారు. వారి చేత మానవ వ్యర్థాన్ని తినిపించారు. మూత్రాన్ని తాగించారు!

ఇదీ జరిగింది..

డుంకాలోని అశ్వరి గ్రామంలో శనివారం జరిగింది ఈ ఘటన. ఆ గ్రామంలో నివాసముంటున్న నలుగురిపై కొందరు దాడి చేశారు. క్షుద్రపూజలు చేస్తున్నారని కొట్టారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

Jharkhand witchcraft news : అంతేకాకుండా.. ఐరన్​ రాడ్​తో ఆ నలుగురిని చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత.. మలం తినిపించి, మూత్రాన్ని తాగించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను రక్షించారు. చికిత్స కోసం వారిని తొలుత సహైయాహట్​ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి డియోఘర్​లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ నలుగురిలో ముగ్గురు మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది.

"నలుగురిని ఆసుపత్రిలో చేర్పించాము. ముగ్గురు మహిళలను దారుణంగా కొట్టారు. ఆ తర్వాత నలుగురిని పట్టుకుని మలాన్ని తినిపించారు. బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే, మేము స్పందించాము," అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

Jharkhand Dumka crime news : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. 'వాళ్లు చేసిన క్షుద్రపూజలతో.. మా బిడ్డ ఆరోగ్యం చెడిపోయింది. అందుకే ఇలా చేశాము,' అని విచారణలో భాగంగా పోలీసులకు నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు గడిచినా.. మాంత్రికులను, క్షుద్రపూజలను కొందరు విశ్వసిస్తున్నారు. క్షుద్రపూజల పేరుతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం