మహిళ చేత పబ్లిక్‌లో స్నానం చేయించిన అత్తమామలు.. ‘మగ బిడ్డ’ కోసం!
Woman forced to bathe in public : మహారాష్ట్రలో ఓ మహిళ చేత పబ్లిక్‌లో స్నానం చేయించారు ఆమె అత్తమామలు. అలా చేస్తే మగ బిడ్డ పుడతాడని.. క్షుద్రపూజలు చేసుకునే ఓ వ్యక్తి చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
Woman forced to bathe in public : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ చేత పబ్లిక్‌లో స్నానం చేయించారు ఆమె అత్తమామలు. ఇలా చేస్తే.. మగబిడ్డ పుడతాడని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి.. వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. పుణెకు చెందిన ఓ మహిళకు.. 2013లో ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నారు!
కొన్నేళ్ల క్రితం.. ఆ మహిళ నగలను తాకట్టు పెట్టి రూ. 75లక్షలు లోన్ తీసుకున్నాడు ఆ భర్త. అంతేకాకుండా.. తన పుట్టింటి ఆస్తులను కూడా లాగేసుకున్నాడు. తన సంతకాన్ని అతను ఫోర్జరీ చేసినట్టు బాధితురాలు చెప్పింది.
అలా వచ్చిన డబ్బుతో మరో వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. అయితే.. ఈ మధ్యకాలంలో కొల్హాపూర్‌లో క్షుద్రపూజలు చేసే మౌలానా బాబా జమదార్ మాంత్రికుడిని కలిశాడు ఆ భర్త. 'వ్యాపారంలో లాభాలు రావడానికి' అంటూ.. కొన్ని పూజలు చేయించాడు.
'నీకు మగ బిడ్డ పుట్టాలంటే.. నీ భార్యను ఓ జలపాతానికి తీసుకెళ్లి.. పబ్లిక్‌లో స్నానం చేయించూ,' అని ఆ వ్యాపారికి ఆదేశాలిచ్చాడు ఆ మాంత్రికుడు. ఆ మాటలు నమ్మని భర్త, అతని తల్లిదండ్రులు.. ఆ మహిళను రాయ్‌గఢ్‌కు తీసుకెళ్లారు. జలపాతంలో పబ్లిక్ ముందు స్నానం చేయించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ భర్త, అత్తమామాలతో పాటు మాంత్రికుడిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
సంబంధిత కథనం