Delhi Excise policy case: రూ. కోటి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ
Delhi Excise policy case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 35 లొకేషన్లలో సోదాలు నిర్వహించి, రూ. కోటి నగదును, కొన్నికీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
Delhi Excise policy case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. వివాదాస్పదం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆ పాలసీని రద్దు చేసిన విషయం తెలిసిందే.
Delhi Excise policy case: అక్రమ నగదు చెలామణి
ఈ కేసులో భారీగా అవకతవకలు జరిగాయని, పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి అయిందని ఈడీ గుర్తించింది. తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లోని 35 లొకేషన్లలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో దాదాపు కోటి రూపాయల లెక్క తెలియని నగదును గుర్తించి, స్వాధీనం చేసుకుంది. లిక్కర్ వ్యాపారంలో ఉన్న పలువురికి సంబంధించిన కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించింది.
Delhi Excise policy case: తెలుగు డైలీ బోర్డు మెంబర్
ఢిల్లీకి చెందిన న్యూస్ చానల్ లో, అలాగే, ఒక తెలుగు దినపత్రికలో బోర్డు మెంబర్ గా ఉన్న వ్యక్తి, ఒక పంజాబ్ ఎమ్మెల్యే, ప్రముఖ లిక్కర్ బ్రాండ్లను ఇంపోర్ట్ చేసే వ్యాపారంలో ఉన్న ఢిల్లీకి చెందిన మరో వ్యాపార వేత్త.. తదితరులకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయని ఈడీ వర్గాలు తెలిపాయి.
Delhi Excise policy case: 103 దాడులు..
ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పిటవరకు 103 దాడులు చేసింది. అలాగే, గత నెలలో మద్యం వ్యాపారంలో ఉన్న సమీర్ మహేంద్రు, విజయ్ నాయిర్ లను అరెస్ట్ చేసింది. అలాగే, ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా నిందితుడిగా చేర్చింది. 2020 - 2021 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న ఢిల్లీ ఎల్జీ సక్సేనా ఫిర్యాదుై ఈడీ ఈ కేసు విచారణ ప్రారంభించింది.