Telugu News  /  National International  /  Engine Failure Forces Air India Express Flight To Return To Abu Dhabi
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Air India engine failure: ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇంజిన్ వైఫల్యం

03 February 2023, 14:40 ISTHT Telugu Desk
03 February 2023, 14:40 IST

Air India engine failure: భూమికి 1000 అడుగుల ఎత్తున ప్రయాణిస్తూ ఉండగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India) విమానం ఇంజిన్ లో సాంకేతిక సమస్య (engine failure) తలెత్తింది. దాంతో, విమానాన్ని వెనక్కు తిప్పి అబుదాబీ విమానాశ్రయంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు.

Air India engine failure: అబుదాబీ నుంచి కేరళ లోని కోజికోడ్ కు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India) విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తింది. ఒక ఇంజిన్ అకస్మాత్తుగా పని చేయడం (engine failure) ఆగిపోయింది. దాంతో, వెంటనే విమానాన్ని వెనక్కు తిప్పి, బయల్దేరిన అబూదాబీకే తీసుకువెళ్లి, సేఫ్ గా ల్యాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Air India engine failure: 184 మంది ప్రయాణీకులు

184 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ B737-800 (Air India B737-800 Express flight) విమానం అబూదాబీ నుంచి కోజికోడ్ కు బయల్దేరింది. కాసేపైన తరువాత ఒక ఇంజిన్ లో సాంకేతిక సమస్యను (engine failure) పైలట్ గుర్తించారు. ఇంజిన్ పని చేయడానికి అవసరమైన టెంపరేచర్ లేకపోవడంతో ఇంధన దహన ప్రక్రియ నిలిచిపోయినట్లు (Flameout) గుర్తించి, ఏటీసీకి సమాచారమిచ్చి, వెంటనే విమానాన్ని వెనక్కు తిప్పారు. తిరిగి, బయల్దేరిన అబూదాబీ ఏర్ పోర్ట్ కే తీసుకువెళ్లి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమాన ప్రయాణీకులను ప్రస్తుతానికి హోటల్ గదిలో బస ఏర్పాటు చేసి, ప్రత్యామ్నాయ విమానాన్ని సమకూర్చే ప్రయత్నంలో ఉన్నట్లు ఎయిర్ ఇండియా (Air India) అధికారులు తెలిపారు.

టాపిక్