Earthquake : అండమాన్ దీవుల్లో రెండుసార్లు భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో ఇటీవలే భూకంపం సంభవించగా, ఈ ఉదయం మళ్లీ రెండుసార్లు భూకంపం సంభవించింది.
పోర్ట్ బ్లెయిర్, జూలై 5: అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 187 కి.మీ దూరంలో మంగళవారం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది.
ఈ ఉదయం 8:05 గంటలకు సంభవించిన భూకంపం యొక్క లోతు 30 కి.మీ.గా నమోదైంది.
‘భూకంపం తీవ్రత 4.3గా ఉంది. 05-07-2022న 08:05:04 సమయంలో సంభవించింది. లాటిట్యూడ్ 10.27, లాంగిట్యూడ్ 93.75 వద్ద ఈ భూకంపం సంభవించింది. 30 కి.మీ. లోతున భూకంపం సంభవించింది. పోర్ట్‌బ్లేయిర్‌కు 187 కి.మీ. దూరంలో భూకంపం సంభవించింది..’ అని ఎన్‌సీఎస్ ట్వీట్ చేసింది.
దీనికంటే ముందు ఉదయం పోర్ట్ బ్లెయిర్‌కు తూర్పు ఆగ్నేయంగా 215 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 5:57 గంటలకు సంభవించిన భూకంపం లోతు 44 కి.మీ.గా నమోదైంది.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా ఉంది.
టాపిక్