School bus fire: విద్యార్థులు ఉన్న బస్సుకు మంటలు -delhi school bus catches fire in rohini all 21 kids driver safely evacuated ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  School Bus Fire: విద్యార్థులు ఉన్న బస్సుకు మంటలు

School bus fire: విద్యార్థులు ఉన్న బస్సుకు మంటలు

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 05:50 PM IST

స్కూలుకు బస్సుకు మంటలంటుకున్నాయి. అదృష్టవశాత్తూ పిల్లలందరూ క్షేమంగా బయటపడ్డారు.

మంటల్లో చిక్కుకున్న బస్సు (ప్రతీకాత్మక చిత్రం)
మంటల్లో చిక్కుకున్న బస్సు (ప్రతీకాత్మక చిత్రం) (HT_PRINT)

న్యూఢిల్లీ, జూలై 21: ఢిల్లీలోని రోహిణిలో గురువారం మధ్యాహ్నం 21 మంది పిల్లలు, డ్రైవర్‌తో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్ సత్వర చర్య వల్ల ఎవరూ గాయపడలేదు.

*రోహిణి సెక్టార్-7 సమీపంలోని బాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుండి స్కూల్ బస్సు గురించి అగ్నిమాపక స్టేషన్‌కు కాల్ వచ్చింది. మొత్తం మూడు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 21 మంది పిల్లలు, డ్రైవర్‌తో ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి’ అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి చెప్పారు.

మంటల్లో మూడు కార్లు కూడా దగ్ధమయ్యాయి. పిల్లలందరినీ, డ్రైవర్‌ని సురక్షితంగా బయటకు తీశారని తెలిపారు. మధ్యాహ్నం 2.50 గంటలకు మంటలు పూర్తిగా ఆపివేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్