రూ. 100 'పేటీఎం' చేసి.. పోలీసులకు దొరికిపోయిన దొంగలు!-delhi police catch robbers with the help of paytm transaction
Telugu News  /  National International  /  Delhi Police Catch Robbers With The Help Of Paytm Transaction
రూ. 100 'పేటీఎం' చేసి.. పోలీసులకు దొరికిపోయిన దొంగలు!
రూ. 100 'పేటీఎం' చేసి.. పోలీసులకు దొరికిపోయిన దొంగలు! (HT_PRINT)

రూ. 100 'పేటీఎం' చేసి.. పోలీసులకు దొరికిపోయిన దొంగలు!

03 September 2022, 8:34 ISTSharath Chitturi
03 September 2022, 8:34 IST

Police catch robbers with the help of Paytm transaction : పేటీఎంతో లావాదేవీలే కాదు.. దొంగలను కూడా పట్టుకోవచ్చు! రూ. 6కోట్లు విలువ చేసి పారిపోయిన ఓ దొంగల ముఠాను పోలీసులు.. 'రూ. 100 పేటీఎం ట్రాన్సాక్షన్​' సాయంతో పట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

Police catch robbers with the help of Paytm transaction : దొంగలు తెలివిగా క్రైమ్​లు చేయడం మొదలుపెట్టారు. పోలీసులు.. అంతకన్నా తెలివిగా వారిని పట్టుకుంటున్నారు! రూ. 100 ‘పేటీఎం ట్రాన్సాక్షన్​’తో దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న ఘటన తాజాగా ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. వారి నుంచి రూ. 6కోట్లు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

కళ్లల్లో కారం కొట్టి..

దాదాపు 10 రోజుల క్రితం.. బుధవారం తెల్లవారుజామున 4:15 గంటలకు జరిగింది ఈ ఘటన. డెలివరీ బాయ్​గా పనిచేసే సోమ్​వీర్​.. తన సహచరుడు జగ్​దీప్​ సైనితో కలిసి పార్సిల్​ తీసుకోవడానికి పహర్​గంజ్​లోని ఆఫీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి పార్సిల్​ తీసుకుని డీజీబీ రోడ్డువైపు వెళ్లారు. వారిద్దరు మిలీనియం హోటల్​కు చేరుకునే సరికి.. ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించారు. అందులో ఒకరు పోలీసు యూనిఫాం వేసుకుని ఉన్నాడు.

పార్సిల్​ చెక్​ చేయాలని పోలీసు యూనిఫాం వేసుకున్న వ్యక్తి.. సోమ్​వీర్​కు చెప్పాడు. ఇంతలో.. మరో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. మొత్తం మీద నలుగురు.. సోమ్​వీర్​, అతని సహచరుడి కళ్లల్లో కారం చల్లి, పార్సిల్​ బ్యాగు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కొద్ది సేపటికే బ్యాగు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు.

Paharganj Robbery : ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోమ్​వీర్​. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 700కుపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దొంగలను గుర్తించారు. స్థానిక నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఆ నలుగురు కార్యకలాపాలను ట్రాక్​ చేయడం మొదలుపెట్టారు.

ఇంతలో.. నిందితుల్లో ఓ వ్యక్తి.. ఓ క్యాబ్​ డ్రైవర్​కు రూ. 100 పేటీఎం చేశాడు. టీ కొనుగోళ్ల కోసం డబ్బుల బదులు పేటీఎం ట్రాన్సాక్షన్​ చేశాడు. ఆ ట్రాన్సాక్షన్​ను అనాలసిస్​ చేసిన పోలీసులు.. నిందితుడు నజఫ్​గఢ్​వాసి అని తేలింది.

నిందితుడు రాజస్థాన్​కు వెళ్లినట్టు పోలీసులు తెలుసుకున్నారు. జైపూర్​కు ప్రత్యేక బృందాన్ని పంపించారు. చివరికి.. ముగ్గురు నిందితులు నగేశ్​ కుమార్​(28), శివం(23), మనీశ్​ కుమార్​(22)లను అరెస్ట్​ చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Delhi robbery case : నిందితుల నుంచి 6,270 గ్రాముల బంగారం, మూడు కోజీల వెండి, 106 రా డైమండ్లతో పాటు మొత్తం రూ. 6కోట్లు విలువ చేసే విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో భాగంగా.. ఈ దొంగతనానికి నగేశ్​ సూత్రధారి అని, తన స్నేహితులతో కలిసి క్రైమ్​కు పాల్పడేందుకు అతనే ప్లాన్​ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు.

సంబంధిత కథనం