Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం! కరాచీలో హై సెక్యూరిటీ మధ్య చికిత్స!
Dawood Ibrahim news : దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం.
Dawood Ibrahim news : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతను.. పాకిస్థాన్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. కానీ.. ఈ విషయంపై పాకిస్థాన్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
విష ప్రయోగంతో ఆసుపత్రిలో దావూద్..!
1993 ముంబై దాడుల సూత్రధారి, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం.. రెండు రోజులుగా కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. హై సెక్యూరిటీ మధ్య అతనికి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. అతను ఉంటున్న ఫ్లోర్‌లోకి ఎవరినీ అనుమతించట్లేదట. అక్కడ ఉన్న ఇతర రోగులను వేరే ఫ్లోర్‌కి తరలించేశారని సమాచారం. టాప్ అఫీషియల్స్‌తో పాటు దావూద్ కుటుంబసభ్యులకు మాత్రమే ఆ ఫ్లోర్‌కి యాక్సెస్ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి.
Dawood Ibrahim hospitalized : దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని, అతను ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడని వస్తున్న వార్తలను ధ్రువీకరించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని సేకరించేందుకు అతని బంధువులతో మాట్లాడేందుకు కృషి చేస్తున్నారు.
దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ను ఎన్ఐఏ జనవరిలో విచారించింది. అండర్ వరల్డ్ డాన్.. రెండో పెళ్లి తర్వాత, కరాచీలో స్థిరపడినట్టు ఆమె వెల్లడించింది. కరాచీ విమానాశ్రయాన్ని దావూద్, అతని సహచరులు కంట్రోల్ చేస్తున్నారని ఎన్ఐఏ, తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
Dawood Ibrahim poisoned : ఎన్ని ఆధారాలున్నా.. పాకిస్థాన్ మాత్రం.. దావూద్ తమ దేశంలో లేడని వాదిస్తోంది. ఇక ఇప్పుడు.. కరాచీలోని ఆసుపత్రిలో హై సెక్యూరిటీ మధ్య అతనికి చికిత్స లభిస్తోందన్న వార్తలపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం..
భారత పోలీసులు ప్రకారం.. దావూద్ ఇబ్రహీం, అతని డీ-కంపెనీ.. ముంబైలో ఇంకా నేర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ముంబైలో.. డ్రగ్స్, ఆయుధాల ట్రాఫికంగ్, నకిలీ నోట్ల రవాణా వంటివి ఇంకా సాగిస్తున్నాడు దావూద్. అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో అతనికి బలమైన లింక్‌లు ఉన్నాయి.
Dawood Ibrahim latest news : 1993 ముంబై దాడులను దేశం ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది. వరుస పేలుళ్లతో భారీ నష్టాన్నే చూసింది ముంబై. దావూద్ ఇబ్రహీం సూత్రధారిగా ఉన్న ఈ దాడుల్లో.. 250మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1000కిపైగా మంది గాయపడ్డారు.
సంబంధిత కథనం