China-Pakistan developing virus: కరోనాను మించిన వైరస్ కోసం చైనా, పాక్ ప్రయత్నాలు-chinapakistan secretly developing virus deadlier than covid reports claim ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China-pakistan Developing Virus: కరోనాను మించిన వైరస్ కోసం చైనా, పాక్ ప్రయత్నాలు

China-Pakistan developing virus: కరోనాను మించిన వైరస్ కోసం చైనా, పాక్ ప్రయత్నాలు

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 10:25 PM IST

China-Pakistan secretly developing virus deadlier than Covid: మరో మహమ్మారిని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? కరోనా కల్లోలం ముగియకముందే, ఆ విలయ తాండవాన్ని మర్చిపోకముందే, అంతకుమించిన ప్రాణాంతక వైరస్ ను ప్రపంచం పైకి వదలడానికి చైనా, పాకిస్తాన్ లు ప్రయత్నిస్తున్నాయా?

కరోనా వైరస్
కరోనా వైరస్

China-Pakistan secretly developing virus deadlier than Covid: చైనా సహకారంతో పాకిస్తాన్ కరోనా ను మించిన ప్రాణాంతక వైరస్ ను సృష్టించడానికి ప్రయోగాలు చేస్తోందన్న వార్త సంచలనం సృష్టించింది.

China-Pakistan secretly developing virus deadlier than Covid: రావల్పిండిలోని ల్యాబ్ లో..

పాక్ లోని రావల్పిండిలో ఉన్న లేబోరేటరీలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయని ఒక వార్తాకథనం వెల్లడించింది. పాకిస్తాన్, చైనా భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతోందని తెలిపింది. చైనాలోని Wuhan Institute and Defence Science and Technology Organisation (DSTO) ఈ ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నాయని వెల్లడించింది. ఇందులో DSTO అనేది పాక్ ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థ.

China-Pakistan secretly developing virus deadlier than Covid: పాక్ ఖండన

ఈ వార్తను పాకిస్తాన్ ఖండించింది. రావల్పిండిలో తమ ప్రయోగశాల ఉందన్న విషయం రహస్యమేం కాదని, అయితే, అందులో వార్తాకథనాలు ప్రస్తావించినట్లుగా ఎలాంటి వైరస్ ల సృష్టి కోసం ప్రయత్నాలు జరగడం లేదని వివరించింది. రావల్పిండిలోని ఉన్న కంటోన్మెంట్ ప్రాంతంలోని హై సెక్యూరిటీ జోన్ లో ఈ లాబోరేటరీ ఉంది. ఈ ల్యాబ్ నిర్వహణ పాక్ సైన్యం చేతిలో ఉంటుంది. కరోనాను మించిన ప్రమాదకరమైన వైరస్ సృష్టించడానికి చైనా ప్రయత్నిస్తోందన్న వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. కానీ, పాక్, చైనా భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టు కొనసాగుతోందన్న వెలువడిన వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Whats_app_banner