Sasha cheetah death : అయ్యో.. నమీబియా నుంచి వచ్చిన చిరుత మృతి!-cheetah sasha dies in mp s kuno park big cat had kidney infection ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sasha Cheetah Death : అయ్యో.. నమీబియా నుంచి వచ్చిన చిరుత మృతి!

Sasha cheetah death : అయ్యో.. నమీబియా నుంచి వచ్చిన చిరుత మృతి!

Sharath Chitturi HT Telugu
Mar 28, 2023 06:08 AM IST

Cheetah Sasha dies : కూనో నేషనల్​ పార్కులో నివాసముంటున్న 20 చిరుతల్లో ఒకటి మరణించింది. ఈ సాషా చిరుత.. గతేడాది నమీబియా నుంచి ఇండియాకు వచ్చింది.

నమీబియా నుంచి తెచ్చిన చిరుత మృతి
నమీబియా నుంచి తెచ్చిన చిరుత మృతి (HT_PRINT)

sasha cheetah death : నమీబియా నుంచి గతేడాది ఇండియాలోకి అడుగుపెట్టిన 8 చిరుతల్లో ఒకటి మరణించింది. జనవరి నుంచి కిడ్నీ సంబంధిత వ్యధితో బాధపడుతున్న 'సాషా'.. సోమవారం తుదిశ్వాస విడిచింది. మధ్యప్రదేశ్​లోని కూనో నేషనల్​ పార్కులో నివాసముంటున్న సాషా.. రోజువారీ పరీక్షల్లో చాలా బలహీనంగా కనిపించింది. వైద్యపరీక్షలు నిర్వహించగా.. చిరుతకు డీహైడ్రేషన్​ అవుతోందని, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది.

7 చిరుతలు సేఫ్​..!

చిరుతకు నిర్వహించిన రక్త పరీక్షలో.. క్రియాటినైన్​ లెవెల్స్​ చాలా ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు గమనించారు. ఇది కిడ్నీ సమస్యకు సంకేతామని తెలుసుకున్నారు. అయితే.. పార్కులోని ఇతర చిరుతలు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

cheetah Sasha dies : దేశంలో చిరుతలు అంతరించిపోయాయి దశాబ్దాలు గడిచిపోయింది. దేశంలోని చివరి చిరుతపులి 1947లో మరణించింది. 1952లో ఈ చిరుతను అంతరించిపోయిన జాతిగా గుర్తించారు. దశాబ్దాల తర్వాత గతేడాది సెప్టెంబర్​లో 8 చిరుతలు దేశంలోకి అడుగుపెట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన (సెప్టెంబర్​ 17) సందర్భంగా వాటిని పార్కులోకి విడుదల చేశారు. ఎనిమిదింట్లో.. 5 ఆడ, 3 మగ చిరుతలు ఉన్నాయి. సాషాతో పాటు మరో చిరుత వయస్సు 5ఏళ్లు.

ఈ 8 చిరుతలను తొలుత క్వారంటైన్​లో ఉంచారు. ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తూ వచ్చారు. అనంతరం ఒక్కొక్కటిగా అడవుల్లో వదలడం మొదలుపెట్టారు. గత వారమే.. ఎల్టాన్​, ఫ్రెడ్డీ అనే చిరుతలను క్వారంటైన్​ నుంచి అడవుల్లోకి వదిలారు.

Kuno National park Cheetahs : ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 12 చిరుతులను కూనో నేషనల్​ పార్కుకు తీసుకొచ్చారు. ఈ 12లో 7 మగ, 5 ఆడ చిరుతలు ఉన్నాయి. రాష్ట్ర సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్​ యాదవ్​లు.. వీటిని కూనో నేషనల్​ పార్క్​లో|ని క్వారంటైన్​ ఎన్​క్లోజర్​లో విడిచిపెట్టారు. ఇవన్నీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవే. వీటితో కలుపుకుని.. కూనో నేషనల్​ పార్కులో మొత్తం 20 చిరుతలు ఉన్నట్టు. వీటిల్లో ఒకటి మరణించింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్