Holi | 'చెప్పులతో కొట్టుకున్నారు..'- ఇవెక్కడి హోలీ వేడుకలు రా బాబు!-chappal holi bizarre celebrations in bihar s amusement park ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Holi | 'చెప్పులతో కొట్టుకున్నారు..'- ఇవెక్కడి హోలీ వేడుకలు రా బాబు!

Holi | 'చెప్పులతో కొట్టుకున్నారు..'- ఇవెక్కడి హోలీ వేడుకలు రా బాబు!

HT Telugu Desk HT Telugu
Mar 18, 2022 04:58 PM IST

Holi celebrations | హోలీలో గుడ్లు, టమాటాలు గాల్లోకి ఎగరడం చాలా సాధారణమైన విషయం. కానీ వేడుకల్లో మీరు ఎప్పుడైనా చెప్పులు గాల్లోకి ఎగరడం చూశారా? ప్రజలు ఒకరిపైకి ఒకరు రంగులు, గుడ్లు కాకుండా.. చెప్పులను విసురుకోవడం చూశారా? బిహార్​లో శుక్రవారం ఇదే జరిగింది.

చెప్పులతో హోలీ వేడుకలు
చెప్పులతో హోలీ వేడుకలు (ANI)

Chappal Holi | హోలీ అంటే రంగుల పండుగ. సాధారణంగా అందరు రకరకాల రంగులతో హోలీ ఆడుకుంటారు. కొందరు గుడ్లు, టమాటాలు విసురుకుని హోలీ రోజు ఎంజాయ్​ చేస్తారు. కానీ దేశంలోని ఓ ప్రాంతంలో.. గుడ్లు, టమాటాలు గాలిలో ఎగరలేదు. వాటి స్థానంలో చెప్పులు గాల్లోకి ఎగిరాయి. ప్రజలు ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

బిహార్​లోని ఓ అమ్యూజ్​మెంట్ పార్కులో జరిగిందీ ఘటన. నీళ్లల్లోకి దిగిన ప్రజలు.. చెప్పులనే అస్త్రాలుగా మార్చుకున్నారు. వాటితో కాలక్షేపం చేయాలని భావించినట్టు ఉన్నారు. ముందు వెనకా చూడకుండా.. చెప్పులను గాలిలోకి విసురుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుని హోలీ వేడుకలు జరుపుకున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ ఇలా కనిపించిన చెప్పులను చేతిలో పట్టుకుని గాల్లోకి వదిలారు. వెనక డీజే సాంగ్స్​ వస్తుంటే.. ఫుల్​గా ఎంజాయ్​ చేశారు.

ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు దానిపై విశేషంగా స్పందిస్తున్నారు. 'బిహార్​లోనే ఇలాంటివి జరుగుతాయి,' అని కొందరు అంటుంటే.. 'ఇదెక్కడి హోలీ వేడుకలు రా బాబు,' అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. 'అసలు ఇదంతా ఎలా స్టార్ట్​ అయ్యింది?' అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు అక్కడి ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఘటనపై నెట్టింట్లో మీమ్స్​ వెల్లువెత్తుతున్నాయి.

వీడియోను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం