LIC news latest | ఐపీఓ వేళ కేంద్రం కీలక నిర్ణయం!
LIC IPO |ఎల్ఐసీలోని ఎఫ్‌డీఐ విధానాలను సులభతరం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 20శాతం పెట్టుబడులను ప్రత్యక్ష మార్గం ద్వారా అనుతించేందుకు అంగీకరించినట్టు సమాచారం.
LIC FDI limit | త్వరలో ఐపీఓకు రానున్న ఎల్ఐసీలో.. ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానాలకు సంబంధించి కీలక సవరణ చేసింది కేంద్రప్రభుత్వం! ప్రత్యక్ష(ఆటోమేటిక్) విధానాల్లో ఎఫ్‌డీఐలు 20శాతం పెట్టుబడులు పెట్టే విధంగా అనుమతించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఎఫ్‌డీఐలు సులభంగా ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు సైతం ఎల్ఐసీ విధానాల్లో కేంద్రం మరికొన్ని మార్పులు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా.. దేశంలో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు అవకాశం మెరుగుపడుతుందని, ఎఫ్‌డీఐల రూపంలో నగదు ప్రవాహం ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్టు చెప్పాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్టుబడులు, ఆదాయం, ఉద్యోగ అవకశాలు పెరుగుతాయని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నాయి.
ప్రస్తుత విధానాల ప్రకారం.. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లలో ఎఫ్ఐడీఐలకు 20శాతం వరకు అవకాశం ఉన్నా.. అందుకు ప్రభుత్వం అనుమతిని కచ్చితంగా తీసుకోవాలి. కేంద్రం తాజా నిర్ణయంతో ఎఫ్‌డీఐలకు పని కాస్త సులభమైంది.
ఎల్ఐసీ ఐపీఓపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎఫ్‌డీఐలు సైతం ఆసక్తి చూపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
5శాతం వాటా…
LIC IPO date | ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈనెల 13న సెబీ వద్ద దాఖలు చేసింది కేంద్రం. మొత్తం 5శాతం వాటాను ఐపీఓలోకి తీసుకొచ్చింది. ఆ విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.
మొత్తం మీద 31.6కోట్ల ఈక్విటీ షేర్ల(5శాతం) వాల్యుయేషన్‌తో సెబీ వద్దకు వెళ్లింది కేంద్రం. 2021 సెప్టెబర్ 30 నాటికి ఈ 5శాతం షేర్ల విలువ రూ. 5.4లక్షల కోట్లుగా ఉంది.
LIC IPO | ఈ బీమా సంస్థకు 66శాతం మార్కెట్ వాటా ఉంది. మొత్తం మీద 283మిలియన్ పాలసీలు కంపెనీ వద్ద ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1.35 మిలియన్ మంది ఏజెంట్లు ఉన్నారు.
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం.. ఇటీవలే ఎయిర్ ఇండియాను టాటాలకు అప్పగించింది. అదే సమయంలో ఎల్ఐసీ ఐపీఓను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
గతంలో భారీ ఐపీఓలు వస్తున్న సమయంలో.. మార్కెట్లు అనేకమార్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఐపీఓలో పాల్గొనేందుకు మదుపర్లు భారీ మొత్తంలో డబ్బులు వెనక్కి తీసుకోవడంతో మార్కెట్లో లిక్విడిటీ కొంతమేర తగ్గిపోయేది.
ఎల్ఐసీ ఐపీఓ సక్సెస్ అవ్వాలని ప్రభుత్వం ప్రార్థనలు చేస్తోంది. ఈ ప్రార్థనలు ఏమేరకు ఫలిస్తాయనేది మరో నెల రోజుల్లో తెలిసిపోతుంది!
సంబంధిత కథనం