By Election results 2022 : ‘ఉప’ సమరంలో బీజేపీ హవా..!-by election results 2022 bjp ahead in 4 states tough fight in munugodu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  By Election Results 2022 Bjp Ahead In 4 States, Tough Fight In Munugodu

By Election results 2022 : ‘ఉప’ సమరంలో బీజేపీ హవా..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 06, 2022 12:33 PM IST

By Election results 2022 : ఉపఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. కాగా.. 7 సీట్లకు ఎన్నికలు జరగ్గా.. నాలుగింట్లో బీజేపీ ప్రస్తుతం లీడ్​లో ఉంది.

‘ఉప’ సమరంలో బీజేపీ హవా..!
‘ఉప’ సమరంలో బీజేపీ హవా..!

By Election results 2022 : దేశంలో 'ఉపఎన్నికల' ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. పటిష్ఠ బందోబస్తు మధ్య ఓట్లను లెక్కిస్తున్నారు అధికారు. పలు ప్రాంతాల్లో పరిస్థితులు.. వార్​ వన్​ సైడ్​ అన్నట్టు ఉండగా.. ఇంకొన్ని చోట్ల మాత్రం హోరాహోరీ యుద్ధం నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​..

బీజేపీ సిట్టింగ్​ ఎమ్మెల్యే అరవింద్​ గిరి మరణంతో.. ఉత్తర్​ప్రదశ్​లో​ గోల గోఖర్నాథ్​ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ బీజేపీ, ఎస్​పీ మధ్య పోటీ నడిచింది. బీఎస్​పీ, కాంగ్రెస్​లు పోటీ చేయలేదు. కాగా.. తాజా వార్తల ప్రకారం.. ఎస్​పీ అభ్యర్థి వినయ్​ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్​ గిరి(అరవింద్​ గిరి తనయుడు) ఆధిక్యంలో ఉన్నారు.

బిహార్​..

Bihar By Election results : సీఎం నితీశ్ కుమార్​..​ బీజేపీకి వీడ్కోలు పలికి విపక్షాలతో జత కట్టిన తర్వాత.. బిహార్​లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొకామ, గోపాల్​గంజ్​ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. తాజా లెక్కింపులో.. సిట్టింగ్​ స్థానమైన మోకామను ఆర్​జేడీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సోనమ్​ దేవిపై ఆర్​జేడీ అభ్యర్థి నీలిమ్​ దేవి గెలుపొందారు. నీలిమ్​ దేవీ భర్త, అనంత్​ సింగ్​ అనర్హత వేటుతో ఎమ్మెల్యే సీటును కోల్పోవడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.

కాగా.. సిట్టింగ్​ స్థానమైన గోపాల్​గంజ్​లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. పలు దశాబ్దాలుగా బీజేపీ ఖాతాలోనే ఉన్న ఈ సీటును దక్కించుకోవాలని ఆర్​జేడీ చూస్తోంది. బీజేపీ అభ్యర్థి కుసుమ్​ దేవి.. ఆర్​జేడీ అభ్యర్థి మోహన్​ గుప్తా మధ్య పోటీ నెలకొంది.

హరియాణా..

హరియాణాలో అదంపూర్​ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించారు. ఇందులో బీజేపీ తరపున బరిలో దిగిన భవ్య బిష్ణోయ్​.. 35వేలకుపైగా మెజారిటీతో గెలుపువైపు దూసుకెళుతున్నారు. ఇక్కడి సిట్టింగ్​ ఎమ్మెల్యే, భవ్య బిష్ణోయ్​ తండ్రి.. కుల్దీప్​పై అనర్హత వేటుపడటంతో ఎన్నిక అనివార్యమైంది.

మహారాష్ట్ర..

Andheri East By election result : మహారాష్ట్ర అంధేరీ ఈస్ట్​కు ఉపఎన్నిక నిర్వహించారు. శివసేన అభ్యర్థి రుతుజ లట్కే.. ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె భర్త, శివసేన మాజీ ఎమ్మెల్యే మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

ఉద్ధవ్​ ఠాక్రే- ఎక్​నాథ్​ శిండే- బీజేపీ వ్యవహారం తర్వాత మహారాష్ట్రలో జరిగిన తొలి ఎన్నిక ఇది. పార్టీని పెట్టిన తర్వాత.. పేరు, చిహ్నాన్ని మార్చుకుని ఉద్ధవ్​ ఠాక్రే వర్గం పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.

ఒడిశా..

ఒడిశా ధామ్​నగర్​లో అధికార బీజేడీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సిట్టింగ్​ ఎమ్మెల్యే, బీజేపీ నేత బిష్ణు చరణ్​ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. ఆయన తనయుడిని బీజేపీ బరిలో దింపింది. బీజేపీ ఇక్కడ ముందంజలో ఉంది.

తెలంగాణ..

Munugodu By Election result : మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. ఇక్కడ టీఆర్​ఎస్​, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీపై ప్రస్తుతం టీఆర్​ఎస్​ స్వల్ప ఆధిక్యంలో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మొత్తం మీద 7 సీట్లల్లో.. బీజేపీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం