Munugode Results Live Updates : ఆ 12 మందితో రాజీనామా చేయించండి
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Sun, 06 Nov 202204:35 PM IST
లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది
మునుగోడులో ఎన్నిక లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశం దృష్టి మొత్తం మునుగోడు ఉపఎన్నికపై ఉందన్నారు. పక్షపాతం లేకుండా లెక్కింపు ప్రక్రియ జరిగిందన్నారు.
Sun, 06 Nov 202204:29 PM IST
ఆ 12 మందితో రాజీనామా చేయించండి
మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి హీరోలా పోరాటం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ గెలుపుతో టీఆర్ఎస్ నేతల్లో మళ్లీ అహంకారం మొదలైందన్నారు. ఇచ్చిన హామీ మేరకు మునుగోడు సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించాలన్నారు. . దమ్ముంటే టీఆర్ఎస్ లో చేరిన 12 మందితో రాజీనామా చేయించాలని బండి సవాల్ విసిరారు. అధికారమే లక్ష్యంగా అభివృద్ధికోసం పనిచేస్తామని చెప్పారు.
Sun, 06 Nov 202212:36 PM IST
కేటీఆర్ ఫైర్
మరోవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంపై టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుతున్నాయి. తెలంగాణ భవన్ లో వేడుకలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగానూ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎప్పుటికి కేసీఆర్ తోనే అంటూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ పతనం మునుగోడు నుంచే మొదలైందన్నారు. ఫలితాలపై మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. వందల కోట్లు ఖర్చు టీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ అనుకుందని ఆరోపించారు. మోదీ, అమిత్ షా డైరెక్షన్ లో ఇదంతా చేశారని అన్నారు. ఈ గెలుపుతో నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేశామన్నారు.
Sun, 06 Nov 202212:00 PM IST
టీఆర్ఎస్ విక్టరీ
మునుగోడులో కౌంటిింగ్ ముగిసింది. 15 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి 11,666 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. అధికారికంగా ఈసీ ప్రకటన చేయాల్సి ఉంది.
Sun, 06 Nov 202211:38 AM IST
10 వేలు దాటిన మెజార్టీ….
మునుగోడులో 14 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఇందులోనూ టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. 14 రౌండ్లు పూర్తి అయ్యేసరికి… 10,094 లీడ్ లో ఉంది టీఆర్ఎస్.
Sun, 06 Nov 202211:07 AM IST
పతనం మునుగోడు నుంచే….
మునుగోడు ఫలితాలపై మంత్రి జగదీశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మునుగోడు నుంచే బీజేపీ పతనం మొదలైందన్నారు. మునుగోడు నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
Sun, 06 Nov 202211:07 AM IST
9వేల ఆధిక్యంలో టీఆర్ఎస్…
13 రౌండ్లు ముగిసే సరికి 9,039 ఓట్ల ఆధిక్యంలో TRS కొనసాగుతోంది. మరోవైపు కేవలం రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది.
Sun, 06 Nov 202210:58 AM IST
విజయం నాదే
ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. దేశ చరిత్రలోనే ఇలా ఎక్కడా జరగలేదన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలా చేసిందన్నారు. టీఆర్ఎస్ ది విజయం కాదన్న ఆయన... అక్రమాలతో గెలిచిందని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతోందన్న ఆయన... ఈ ఫలితం మొదటిమెట్టు అన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు, మద్యం ఏరులై పారించిందని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలో తన విజయం కోసం కృషి చేసిన వారికి ధన్యవాదాలు చెప్పారు. టీఆర్ఎస్ కు ఓట్లు వేయకపోతే పథకాలు రద్దవుతాయని ఓటర్లను బెదిరించారని... పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. మునుగోడు ప్రజల మనసుల్లో తాను ఉన్నానని వ్యాఖ్యానించారు.
Sun, 06 Nov 202210:58 AM IST
13 రౌండ్ లోనూ లీడ్…
13వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ పార్టీ ఆధికత్యను ప్రదర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది.
Sun, 06 Nov 202210:29 AM IST
టీఆర్ఎస్ లీడ్…
12 రౌండ్లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి 7,794 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో 3 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Sun, 06 Nov 202210:23 AM IST
దూసుకెళ్తున్న కారు…
12వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు 1.80 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.
Sun, 06 Nov 202209:42 AM IST
12వ రౌండ్ కౌంటింగ్
ప్రస్తుతం 12వ రౌండ్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 5వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
Sun, 06 Nov 202209:40 AM IST
విజయం దిశగా..
మునుగోడులో టీఆర్ఎస్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 11వ రౌండ్ తర్వాత.. 5800 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
Sun, 06 Nov 202209:27 AM IST
4539 ఓట్ల ఆధిక్యం….
10 రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. 4539 ఓట్ల ఆధిక్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
Sun, 06 Nov 202208:53 AM IST
3,925 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్..
9వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. 3,925 ఓట్ల ఆధిక్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
Sun, 06 Nov 202208:23 AM IST
మళ్లీ లీడ్…
8వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 3285 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది.
Sun, 06 Nov 202208:18 AM IST
8 వ రౌండ్ స్టార్ట్…
8 వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. అన్ని రౌండ్లలోనూ బీజేపీ హోరాహోరీగా ముందుకు వస్తోంది. ఇక చండూరులో తమకు ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.
Sun, 06 Nov 202208:00 AM IST
మరో రౌండ్ లోనూ టీఆర్ఎస్సే…
7వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. ఏడు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ లీడ్ 2555 ఓట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Sun, 06 Nov 202207:58 AM IST
ఆధిక్యంలో టీఆర్ఎస్…
ప్రస్తుతానికి 93 వేలకు పైగా ఓట్ల లెక్కింపు ముగిసింది. ఆరు రౌండ్లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.
Sun, 06 Nov 202207:04 AM IST
2 వేల ఆధిక్యంలో టీఆర్ఎస్…
ఆరో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ మరోసారి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం 2 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు బీజేపీ వెనకపడినట్లు కనిపిస్తోంది.
Sun, 06 Nov 202206:49 AM IST
ఆరో రౌండ్ కౌంటింగ్ షురూ….
చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయింది. ఆరో రౌండ్ కౌంటింగ్ మొదలైంది.
Sun, 06 Nov 202206:46 AM IST
టీఆర్ఎస్ లీడ్…
మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఆ పార్టీకి 1,631 ఓట్ల ఆధిక్యం ఉంది. ఐదో రౌండ్‌లో తెరాసకు 6,162, భాజపాకు 5,245 ఓట్లు వచ్చాయి. నాలుగు, ఐదు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ఉంది.
Sun, 06 Nov 202206:28 AM IST
సీఈఓ క్లారిటీ…
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆస్యం కావటంపై సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందునే ప్రక్రియ ఆలస్యం అవుతుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు.
Sun, 06 Nov 202206:21 AM IST
1430 ఓట్ల మెజార్టీ…
ఐదో రౌండ్ ఫలితాలు వచ్చేశాయి. ఇందులోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనబరించినట్లు తెలుస్తోంది. 1430 ఓట్ల ఆధిక్యంలో కారు పార్టీ ఉన్నట్లు సమాచారం.
Sun, 06 Nov 202206:03 AM IST
అందుకే ఆలస్యం….
ఐదో రౌండ్ ఆలస్యంపై అధికారులు వివరణ ఇచ్చారు. టీ బ్రేక్ ఇవ్వటంతోనే ఆలస్యం అయిందని తెలిపారు.
Sun, 06 Nov 202206:01 AM IST
ఐదో రౌండ్ ఆలస్యం……
ఐదు రౌండ్ ఫలితాలు ఆలస్యం కావటంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్… రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Sun, 06 Nov 202206:00 AM IST
భారీగా ఓట్లు….
ఈ ఉపఎన్నికలో బీజేపీ పార్టీ ప్రదర్శన రికార్డు అని చెప్పొచ్చు. గతంలో మునుగోడు గడ్డపై ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గంగిడి మనోహర్ రెడ్డి పోటీ చేయగా 27 వేలకుపైగా ఓట్లు సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 12 వేల ఓట్లకు పడిపోయారు. కానీ ప్రస్తుతం సీన్ చూస్తుంటే... మాత్రం బీజేపీ...టీఆర్ఎస్ కు ధీటుగా ముందుకువస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థికి 25వేలకు పైగా ఓట్లు దాటారు. మొత్తం 15 రౌండ్లు పూర్తి అయితే... బీజేపీ భారీగా ఓట్లు సాధించటం ఖాయంగా కనిపిస్తోంది.
Sun, 06 Nov 202205:35 AM IST
ఓట్ల లెక్కలు…
ప్రస్తుత సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థికి 26343 ఓట్లు రాగా… బీజేపీకి 25,730 ఓట్లు రాగా… కాంగ్రెస్ కు 8వేలకుపైగా ఓట్లు పోలయ్యాయి.
Sun, 06 Nov 202205:31 AM IST
700 ఓట్ల లీడ్…. !
నాలుగో రౌండ్ పూర్తి అయ్యే సరికి టీఆర్ఎస్ మెజార్టీ 700 దాటినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నారాయణపురం మండలంలో వచ్చే ఫలితాలను బట్టి… మునుగోడుపై ఓ అంచనాకు రావొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Sun, 06 Nov 202205:20 AM IST
ప్రస్తుత ఓట్లు ఇవే…
ప్రస్తుత సమయానికి టీఆర్ఎస్ పార్టీకి 29,063 ఓట్లు, బీజేపీకి 25,729 ఓట్లు వచ్చాయి.
Sun, 06 Nov 202205:08 AM IST
అనుకున్నంత రాలేదు - కోమటిరెడ్డి
ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తమకు అనుకున్న మెజార్టీ చౌటుప్పల్ లో రాలేదని వ్యాఖ్యానించారు.
Sun, 06 Nov 202204:57 AM IST
టీఆర్ఎస్ లీడ్…
4వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తం 334 ఓట్ల లీడ్ లో ఉంది. ప్రస్తుతం నారాయణపురం మండల పరిధిలోని ఓట్లు లెక్కిస్తున్నారు.
Sun, 06 Nov 202204:49 AM IST
కూసుకుంట్ల గ్రామంలో బీజేపీ లీడ్…
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లింగవారి గూడెంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యతను కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
Sun, 06 Nov 202204:38 AM IST
బీజేపీ లీడ్…..
మునుగోడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించగా... 2,3,4 రౌండ్లలో బీజేపీ లీడ్ లోకి వచ్చింది. దాదాపు 1100 ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉంది.
Sun, 06 Nov 202204:37 AM IST
బీఎస్పీ ఓట్లు…
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో బీఎస్పీ శంకరాచారి 214, చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ కు మొదటి రౌండ్ లో 104, గాలయ్య చెప్పుల గుర్తు 157 ఓట్లు కేఏ పాల్ ఉంగరం గుర్తు 34 ఓట్లు, రోడ్ రోలర్ గుర్తు శివకుమార్ 84 ఓట్లు సాధించారు.
Sun, 06 Nov 202204:22 AM IST
నాలుగో రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నికల్లో నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మొదటి రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు ఆధిక్యం లభించగా, రెండో రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది.
Sun, 06 Nov 202204:20 AM IST
మూడో రౌండ్‌లో కేఏ పాల్‌కు 34 ఓట్లు
ఓటింగ్ అయిన వెంటనే ఓట్లు లెక్కించాలని, ఇదంతా ప్లాన్డ్‌గా జరిగిందని అధికారులు అంతా కేసీఆర్ తొత్తులని, 298 పోలింగ్ స్టేషన్లు నుంచి తెచ్చిన ఈవీఎంలు పక్కనే దొంగ ఈవీఎంలను పెట్టారని పాల్ ఆరోపించారు. ఉప ఎన్నికలపై కోర్టుకు వెళతామని చెప్పారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు.
Sun, 06 Nov 202204:01 AM IST
రెండో రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 563 ఓట్ల ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌లో రెండో రౌండ్ ముగిసేసరికి 563 ఓట్ల ఆధిక్యత లభించింది.
Sun, 06 Nov 202203:59 AM IST
కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేసిన స్రవంతి
మునుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి పరిమితమైంది. తొలి రెండు రౌండ్లలో పోలింగ్ సరళి అర్థం కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు.
Sun, 06 Nov 202203:50 AM IST
రెండో రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీకి 789 ఓట్ల ఆధిక్యత లభించింది. మొదటి రౌండ్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్ధికి ఆధిక్యత లభించగా రెండో రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యత లభించింది. అర్బన్ ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో గ్రామీణ ఓటర్లపై టిఆర్‌ఎస్ ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని అధికార పార్టీ భావిస్తోంది.
Sun, 06 Nov 202203:39 AM IST
భారీ మెజార్టీతో గెలుస్తామన్న కూసుకుంట్ల
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మొదటి రౌండ్‌లో వచ్చిన ఫలితమే మిగిలిన రౌండ్లలో కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి రౌండ్‌లో ఆధిక్యత లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
Sun, 06 Nov 202203:32 AM IST
మునుగోడులో ఆధిక్యంలో టిర్‌ఎస్
మునుగోడు ఎన్నికల కౌంటింగ్‌లో టిఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం లభించింది. తొలి రౌండ్‌లో 1192ఓట్ల ఆధిక్యత లభించింది. టిఆర్‌ఎస్‌కు 6096 ఓట్లు లభించగా బీజేపీకి 4904ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌కు 1877ఓట్లు దక్కాయి.
Sun, 06 Nov 202203:01 AM IST
తెలంగాణలో 11వ రోజు రాహుల్‍గాంధీ పాదయాత్ర
తెలంగాణలో రాహుల్‍గాంధీ పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. అల్లాదుర్గ్ నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కొనసాగనున్న భారత్ జోడో యాత్ర ఆదివారం అల్లాదుర్గ్, కైదంపల్లి, రాంపూర్, నిజాంపేట్, నారాయణఖేడ్, మహాదేవ్‍పల్లి మీదుగా పాదయాత్ర సాగనుంది. ఉదయం 10 గంటలకు లక్ష్మాపూర్ దగ్గర మార్నింగ్ బ్రేక్ తీసుకోనున్నారు. రాత్రి జుక్కల్‍లో రాహుల్‍గాంధీ బస చేయనున్నారు. నేడు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.
Sun, 06 Nov 202202:58 AM IST
మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు
మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. పోలింగ్ రోజు చివరి మూడు గంటల్లో 20 శాతం ఓట్లు పోలవడంతో గెలుపోటములను అవే డిసైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో చివరి మూడు గంటల పోలింగ్ పైనే పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోంది.
Sun, 06 Nov 202202:57 AM IST
15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు….
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు. మొదటి నాలుగు రౌండ్లలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవిఎంల ఓట్ల లెక్కింపు జరుగనుంది. చౌటుప్పల్ మండలంలోని ఈవిఎంల ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత 4,5,6 రౌండ్లలో సంస్థాన్ నారాయణ్ పూర్ మండల ఓట్లను లెక్కిస్తారు. 6,7,8 రౌండ్లలో మునుగోడు ఓట్లను లెక్కిసత్ారు. 8, 9, 10 రౌండ్లలో చండూరు మండల ఓట్లను లెక్కిస్తారు. 10,11,12 రౌండ్లలో గట్టుప్పల్, 11,12,13 రౌండ్లలో మర్రిగూడ మండల ఓట్లు, 13,14,15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ ఓట్లను లెక్కించడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టనుంది. చౌటుప్పల్ సంస్థాన్ నారాయణ్ పూర్ మండలాల్లో బీజేపీకి గట్టి పట్టుంది.
Sun, 06 Nov 202203:01 AM IST
విజయం తనదే అంటున్న పాల్వాయి స్రవంతిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ హాల్లోకి వెళ్లే ముందు విజయం తనదేనని ప్రకటించారు. ఎన్ని ఓట్ల ఆధిక్యత లభిస్తుందో చెప్పలేకున్నా తనకు మునుగోడు ఓటర్లు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలు, యువత నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభించిందని స్రవంతి రెడ్డి చెప్పారు.
Sun, 06 Nov 202203:01 AM IST
మునుగోడులో గెలుపుపై కోమటి రెడ్డి ధీమా
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత, కేసీఆర్ వ్యతిరేకత బలంగా ఉందని అర్ధమవుతోందన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా రావడానికి ఆ పార్టీ నేతల బెదిరింపులే కారణమన్నారు. మునుగోడు ఓటర్లు భయపడి ఎగ్జిట్ పోల్‌లో అలా చెప్పి ఉంటారన్నారు. ఏమి చెప్పలేని పరిస్థితుల్లో టిఆర్‌ఎస్ ఉందన్నారు. ఎవరు గెలిచినా 5వేల ఓట్లలోపు ఆధిక్యంతో గెలుస్తారని చెప్పారు. సైలెంట్ ఓటింగ్ బీజేపీకి అనుకూలంగా ఉంటే బీజేపీ గెలుపు ఖాయమన్నారు. గత ఎన్నికలతో అధికంగా ఓటింగ్ నమోదు కావడమే కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.