ఈ బడ్జెట్‌తో పేదలు, రైతులకు ఒరిగిందేమీ లేదు: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌పై రాహుల్ గాంధీ మండిపడ్డారు. వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు, యువకులు, రైతులు, ఎంఎస్‌ఎంఈలకు ఈ బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం కేంద్ర బడ్జెట్ విషయమై కేంద్రంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన ఈమేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ బడ్జెట్‌తో వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు, యువత, రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. ఎంఎస్ఎంఈలకు ఈ బడ్జెట్ ద్వారా ఒరిగిందేమీ లేదన్నారు.
కాగా లోక్ సభలో బడ్జెట్‌ను సమర్పించిన సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 9.2 శాతంగా అంచనాలు ఉన్నాయని, ఇది అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే అత్యధికమని వివరించారు. యూనియన్ బడ్జెట్ 2022-23.. రాబోయే 25 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థకు పునాది వేసేదిగా ఉంటుందని, బ్లూప్రింట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని కూడా ఆమె చెప్పారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి.
పార్లమెంట్ కేంద్ర బడ్జెట్ సమావేశాల మొదటి భాగం జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు, రెండవ భాగం బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుండి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి.