Karnataka Assembly Elections: ‘‘ఒంటరి పోరే; విజయం మనదే’’
Karnataka Assembly Elections: 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో పార్టీ కార్యక్రమంలో శనివారం బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
Karnataka Assembly Elections: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సమాయత్తమవుతోంది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పోరాడాలని పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తోంది. అందులో భాగంగా బెంగళూరులో శనివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా పాల్గొన్నారు.
Karnataka Assembly Elections: ఒంటరి పోరే..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. బెంగళూరులోని ప్యాలస్ గ్రౌండ్ లో బీజేపీ బూత్ లెవెల్ అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తులపై వస్తున్న వార్తలను నమ్మవద్దని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందన్నారు. ఒంటరిగానే బరిలో దిగి, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. బీజేపీ తమతో పొత్తు పెట్టుకుంటుందని జేడీఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
Karnataka Assembly Elections: జేడీఎస్ కు ఓటేస్తే.. కాంగ్రెస్ కు వేసినట్లే..
కర్నాటకలో ఈ సారి త్రిముఖ పోటీ ఉంటు దని పత్రికల్లోరాస్తున్నారని, అయితే అది నిజం కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. జేడీ ఎస్ , కాంగ్రెస్ కు తోక పార్టీగా మారిందని, జేడీఎస్ కు ఓటేస్తే, కాంగ్రెస్ కు ఓటేసినట్లేనని అమిత్ షా వ్యాఖ్యానించారు. అందువల్ల, పోటీలో మూడు పార్టీలు ఉన్నా, అది రెండు పార్టీల మధ్య పోటీగానే ఉంటుందని అన్నారు. దేశభక్తులున్న బీజేపీకి ఓటేస్తారో, తుక్ డే , తుక్ డే గ్యాంగ్ లకు ఓటేస్తారో ప్రజలు తేల్చుకోవాలన్నారు.