మస్క్ ట్వీట్‌తో లాభపడ్డ క్రిప్టో కరెన్సీ
సోమవారం బిట్‌కాయిన్, ఈథర్, డాగ్‌కాయిన్ లాభపడ్డాయి.
తాను డిజిటల్ కరెన్సీ కలిగి ఉన్నానని, విక్రయించడానికి ప్లాన్ చేయడం లేదని ఎలోన్ మస్క్ ట్వీట్ చేయడంతో సోమవారం బిట్‌కాయిన్, ఈథర్, డాగ్‌కాయిన్ లాభపడ్డాయి.
మస్క్ ట్వీట్‌కు ముందు 2.9% వరకు పడిపోయిన బిట్‌కాయిన్.. నష్టాలను స్వల్పంగా తగ్గించుకోగలిగింది.. ఈథర్ 2.3% వరకు పెరిగింది. CoinGecko గణాంకాల ప్రకారం క్రిప్టోకరెన్సీలలో గడిచిన గంట వ్యవధిలో Dogecoin అత్యధికంగా 3.8% లాభపడింది.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన మస్క్.. క్రిప్టోకరెన్సీలపై సోషల్-మీడియా పోస్ట్‌లకు కొత్తేమీ కాదు. అక్టోబర్‌లో మస్క్ తనకు బిట్‌కాయిన్, ఈథర్, డాగ్‌కాయిన్‌లు ఉన్నాయని చెప్పారు.
రాబోయే కొన్నేళ్లలో ద్రవ్యోల్బణం రేటు గురించి ట్విట్టర్‌లో మస్క్ ఒక ప్రశ్నను పోస్ట్ చేశాడు. దీనికి మైక్రో స్ట్రాటజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బిట్‌కాయిన్ ట్రేడర్ మైఖల్ సైలర్ ‘బలహీనమైన కరెన్సీలు కూలిపోతాయి. బిట్ కాయిన్ వంటి అరుదైన ఆస్తి ఇంటెన్సిఫై అవుతుంది..’ అని బదులిచ్చారు.
‘మీరు ఆ నిర్ణయానికి చేరుకోవడం పూర్తిగా అనూహ్యమైనది కాదు’ అని మస్క్ బదులిచ్చారు.
టాపిక్