యుద్ధం సృష్టించిన విధ్వంసం.. ఉక్రెయిన్‌లో యుద్ధం ముందు, తర్వాత పరిస్థితుల ఫొటోలు వైరల్-before and after war photos and videos of ukraine now going viral in social media ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  యుద్ధం సృష్టించిన విధ్వంసం.. ఉక్రెయిన్‌లో యుద్ధం ముందు, తర్వాత పరిస్థితుల ఫొటోలు వైరల్

యుద్ధం సృష్టించిన విధ్వంసం.. ఉక్రెయిన్‌లో యుద్ధం ముందు, తర్వాత పరిస్థితుల ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu
Mar 08, 2022 04:07 PM IST

ఉక్రెయిన్‌ ఒకప్పుడు ఓ ప్రశాంత దేశం. ఎన్నో చారిత్రక కట్టడాలకు కేరాఫ్‌ అడ్రెస్‌. కానీ ఇప్పుడా దేశం ఓ వల్లకాడును తలపిస్తోంది. రష్యా బాంబుల దాడి ఉక్రెయిన్‌లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

<p>యుద్ధానికి ముందు, తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఇండిపెండెన్స్‌ స్వ్కేర్‌ పరిస్థితి</p>
యుద్ధానికి ముందు, తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ఇండిపెండెన్స్‌ స్వ్కేర్‌ పరిస్థితి (Twitter)

కీవ్‌: యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. అది పెను విధ్వంసానికి, మానవాళి వినాశనానికి దారి తీస్తుంది అనడానికి ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న దారుణమైన పరిస్థితులే నిదర్శనం. కొన్ని రోజుల కిందటి వరకూ ఎన్నో చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న ఆ దేశం ఇప్పుడు ఎటు చూసినా శిథిలాలు, రోడ్లపై రక్తపు మరకలతో వల్లకాడును తలపిస్తోంది. 

ఒకప్పుడు మనుషులు స్వేచ్ఛగా తిరిగిన వీధులు ఇప్పుడు భయానకంగా కనిపిస్తున్నాయి. ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షించే ఆ దేశంలో రష్యా దురాక్రమణ తాలూకు దారుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వందల మంది పౌరులు బాంబు దాడులు, కాల్పుల్లో మరణించగా.. అనేక కట్టడాలు నేలమట్టమయ్యాయి. 

ఈ నేపథ్యంలోనే యుద్ధానికి ముందు, తర్వాత ఉక్రెయిన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయి. మొదట్లో కేవలం ఉక్రెయిన్‌ మిలిటరీ స్థావరాలైనే దాడి చేస్తామని చెప్పిన రష్యా.. ఇప్పుడు జనవాసాలు సహా ఎక్కడపడితే అక్కడ బాంబులు వేస్తోంది. దీంతో కీవ్‌, ఖార్కివ్‌, సుమీలాంటి ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్