Amul hikes certain milk brand prices: అమూల్ పాల ధరల పెంపు
Amul hikes certain milk brand prices: అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. అయితే, ఈ సారి పెంపులో గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రం మినహాయంచారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ పెంపు వర్తిస్తుందని అమూల్ స్పష్టం చేసింది.
గుజరాత్ కేంద్రంగా ఉన్న ప్రముఖ రాష్ట్ర ప్రభుత్వ రంగ సహకార సంస్థ అమూల్.. మరోసారి తమ పాల బ్రాండ్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమూల్ బ్రాండ్ తో వచ్చే పాలల్లో పలు రకాలకు ఈ పెంపు వర్తిస్తుంది.
Amul hikes certain milk brand prices:ఫుల్ క్రీమ్ పాల పై..
అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్, బఫెలో మిల్క్ లపై లీటరుకు రూ. 2 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో ఫుల్ క్రీమ్ పాల ధర ప్రస్తుతమున్న రూ. 61 నుంచి లీటరుకు రూ. 63కి చేరుతుంది. ఈ పెంపు గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది.
Amul hikes certain milk brand prices: ఇది మూడో సారి..
ఈ సంవత్సరం పాల ధరను అమూల్ పెంచడం ఇది మూడో సారి. గతంలో మార్చ్ నెలలో, ఆగస్ట్ లో కూడా పాల ధరలను పెంచారు. గతంలో ఆమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా బ్రాండ్లపై లీటరుకు రూ. 2 పెంచారు.
Amul hikes certain milk brand prices: పెట్రోల్ తో పోటీ..
పాల ధరల పెంపు నేపథ్యంలో ఆప్ నేత, ఎంపీ గౌరవ్ చద్ధా కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్య విమర్శలు చేశారు. మోదీ పాలనలో పాల ధరలు పెట్రోలు ధరలతో పోటీ పడుతున్నాయని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ మోదీ సర్కారు సామాన్యుల నడ్డి విరుస్తోందని విరుచుకుపడ్డారు. పాల ధరల పెంపుపై కాంగ్రెస్ కూడా విమర్శలు ప్రారంభించింది. ‘‘శుభవార్త.. పాల ధరలు మళ్లీ పెరిగాయి’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.