Adipurush movie : ‘కోర్టుకు రండి’.. ఆదిపురుష్​ టీమ్​కు అలహాబాద్​ హెచ్​సీ ఆదేశం!-allahabad hc directs makers of adipurush to appear before it on july 27 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Adipurush Movie : ‘కోర్టుకు రండి’.. ఆదిపురుష్​ టీమ్​కు అలహాబాద్​ హెచ్​సీ ఆదేశం!

Adipurush movie : ‘కోర్టుకు రండి’.. ఆదిపురుష్​ టీమ్​కు అలహాబాద్​ హెచ్​సీ ఆదేశం!

Sharath Chitturi HT Telugu
Jul 01, 2023 07:08 AM IST

Allahabad HC on Adipurush movie : ఆదిపురుష్​ చిత్ర బృందాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి! తాజాగా.. కోర్టు ఎదుట హాజరుకావాలని.. సినీ బృందాన్ని ఆదేశించింది అలహాబాద్​ హెచ్​సీ.

‘కోర్టుకు రండి’.. ఆదిపురుష్​ టీమ్​కు మరిన్ని కష్టాలు!
‘కోర్టుకు రండి’.. ఆదిపురుష్​ టీమ్​కు మరిన్ని కష్టాలు! (HT_PRINT)

Allahabad HC on Adipurush movie : దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్​ను వివాదాలు వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ సినిమాను అలహాబాద్​ హైకోర్టు తీవ్రంగా పరగిణిస్తున్నట్టు కనిపిస్తోంది. చిత్రంపై ఇప్పటికే తన అసంతృప్తిని బయటపెట్టిన కొర్టు.. తాజాగా ఆదిపురుష్​ టీమ్​ ఆదిపురుష్​ టీమ్​కు పిలుపునిచ్చింది. జులై 27న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీనితోపాటు.. సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలంటూ.. ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

ఐదుగురు సభ్యుల కమిటీ..

ప్రభాస్​ నటించిన ఆదిపురుష్​ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్​ రాజేశ్​ సింగ్​ చౌహాన్​, జస్టిస్​ శ్రీ ప్రకాశ్​ సింగ్​లతో కూడిని వెకేషన్​ బెంచ్​. ఈ క్రమంలోనే జులై 27న హాజరుకావాలని సినిమా దర్శకుడు ఓం రౌత్​, నిర్మాత భూషణ్​ కుమార్​, డైలాగ్​ రైటర్​ మనోజ్​ ముంతషీర్​ను ఆదేశించింది. ఈ సినిమా.. ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి, స్పందన తెలపాలని కేంద్రానికి వెల్లడించింది అలహాబాద్​ హైకోర్టు ధర్మాసనం. అంతేకాకుండా.. ఆదిపురుష్​ సినిమాకు ఇచ్చిన సర్టిఫికేట్​ను రివ్యూ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

అసలు ఆదిపురుష్​ సినిమా.. ప్రజలకు చూపించే విధంగా ఉందా? లేదా? అన్న విషయంపై కేంద్ర సమాచారశాఖ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణలోపు.. స్పందన రాకపోతే.. మినిస్ట్రీ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ అండ్​ బ్రాడ్​కాస్టింగ్​లో నుంచి డిప్యూటీ సెక్రటరీ, అంత కన్నా పై స్థాయిలో ఉన్న అధికారులు.. వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదీ చూడండి:- Adipurush OTT Release: ఓటీటీలోకి ఆదిపురుష్ సినిమా ముందుగా ఆ విధానంలో రానుందా!

మరోవైపు.. తదుపరి విచారణలోపు.. తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ అఫిడవిట్​లు దాఖలు చేయాలని ఆదిపురుష్​ దర్శకుడు, డైలాగ్​ రైటర్​ను ఆదేశించింది అలహాబాద్​ హైకోర్టు వెకేషన్​ బెంచ్​. సినీ బృందం స్పందించేందుకు సమయాన్ని ఇస్తున్నట్టు అందుకే తాము ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఖురాన్​ను తప్పుగా చూపించగలరా..?

అంతకుముందు.. జూన్​ 28న ఆదిపురుష్​ వివాదంపై విచారణ చేపట్టిన అలహాబాద్​ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే చేసింది. "ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ ను తప్పుగా చూపుతూ డాక్యమెంటరీ తీయగలరా? అలా తీస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

హిందూ మత విశ్వాసాలను అవమానిస్తూ, అవహేళన చేస్తూ సినిమాలు తీయడం ఆదిపురుష్ తోనే ప్రారంభం కాలేదని, గతంలో హిందూ దేవుళ్లు, హిందూ దేవతలను హాస్యాస్పదంగా చూపుతూ చాలా సినిమాలు వచ్చాయని కోర్టు వ్యాఖ్యానించింది. త్రిశూల్ సినిమాలో శివుడు త్రిశూలంతో పరుగులు పెడ్తున్న సీన్ ను గుర్తు చేస్తూ, ‘ అలా తీస్తారా? అదేమన్న జోక్ నా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించింది. ఈ రోజు ఆదిపురుష్ ను వదిలేస్తే, ఇలాంటి మరిన్ని వస్తాయని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం