Rakesh Jhunjhunwala | ఆ ఒక్క స్టాక్​తో బిగ్​బుల్​కు రూ. 1185కోట్ల నష్టం..!-1185 crore wiped off rakesh jhunjhunwala portfolio after dip in this stock ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rakesh Jhunjhunwala | ఆ ఒక్క స్టాక్​తో బిగ్​బుల్​కు రూ. 1185కోట్ల నష్టం..!

Rakesh Jhunjhunwala | ఆ ఒక్క స్టాక్​తో బిగ్​బుల్​కు రూ. 1185కోట్ల నష్టం..!

HT Telugu Desk HT Telugu
May 06, 2022 11:32 AM IST

రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్​లో టైటాన్​కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. టైటాన్​తో ఆయనకు భారీ లాభాలు వచ్చాయి. కాగా.. తాజాగా టైటాన్​లో రాకేష్ జున్‌జున్‌వాలా తన వాటాను తగ్గించుకున్నారు.

రాకేష్​ జున్​జున్​​వాలా
రాకేష్​ జున్​జున్​​వాలా (MINT_PRINT/file)

Rakesh Jhunjhunwala portfolio | బిగ్​బుల్​ రాకేష్ జున్‌జున్‌వాలాకు అత్యంత ఇష్టమైన స్టాక్స్​లో 'టైటాన్​' ముందుంటుంది. ఆ స్టాక్​తో భారీగా లాభాలు పొందిన ఆయన.. కోట్ల సంపదను ఆర్జించారు. అలాంటిది.. టైటాన్​​లో రాకేష్​ జున్​జున్​వాలా తన వాటాను తగ్గించుకోవడం గమనార్హం. ఇందుకు కారణలు లేకపోలేవు.

2022 జనవరి- మర్చ్​ త్రైమాసికానికి.. టైటాన్​లో వాటాను 5.09 నుంచి 5.05కి తగ్గించుకున్నారు రాకేష్ జున్‌జున్‌వాలా. ఒక్క 2022లో టైటాన్​ షేరు రూ. 264 పడటం, ఫలితంగా రాకేష్ జున్‌జున్‌వాలా నికర సంపదలో రూ. 1185కోట్లు ఆవిరైనట్టు సమాచారం. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

2022 నుంచి ఇప్పటివరకు గమనిస్తే.. టైటాన్​ షేరు రూ. 2524 నుంచి 2,260 మార్క్​కు పడింది(శుక్రవారం మార్కెట్​ ఓపెన్​కు ముందు). 6 నెలలుగా కన్సాలిడేషన్​ దశలోనే ఉండిపోయిన రాకేష్​జున్​జున్​వాలా స్టాక్​. మరోవైపు 6 నెలల కాలంలో.. ఈ స్టాక్​ సున్నా రిటర్నులను ఇచ్చింది. అంతేకాకుండా 10శాతానికిపైగా పతనమైంది.

టైటాన్​లో బిగ్​బుల్​ వాటా..

Rakesh Jhunjhunwala stock | 2022 చివరి త్రైమాసికానికి రాకేష్ జున్‌జున్‌వాలాకు టైటాన్​లో 3,53,10,395 షేర్లు(3.98శాతం) ఉన్నాయి. కాగా ఆయన భార్య రేఖకు టైటాన్​లో 95,40,575 షేర్లు(1.07శాతం) ఉన్నాయి. ఇద్దరి షేర్లు కలుపుకుంటే రాకేష్ జున్‌జున్‌వాలా స్టాక్​ వాటా 5.05శాతంగా ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్