Watermelon Purchase Tips : మగ పుచ్చకాయ మంచిదా? ఆడ పుచ్చకాయ మంచిదా?-which watermelon is best male or female how to pick a perfect watermelon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Which Watermelon Is Best Male Or Female How To Pick A Perfect Watermelon

Watermelon Purchase Tips : మగ పుచ్చకాయ మంచిదా? ఆడ పుచ్చకాయ మంచిదా?

HT Telugu Desk HT Telugu
Apr 16, 2023 03:00 PM IST

pick a perfect watermelon : పుచ్చకాయ వేసవిలో అందరూ ఇష్టపడే పండు. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. పుచ్చకాయలో ఫైబర్, విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఒక్కోసారి మనం ఇష్టంగా కొనేది సరిగా ఉండకపోవచ్చు. కట్ చేసి చూస్తే.. లోపల పాడైపోయి ఉండచ్చు.

పుచ్చకాయ
పుచ్చకాయ

కొన్నిసార్లు చాలా ఇష్టంగా పుచ్చకాయ(Watermelon) కొనుగోలు చేస్తాం. అమ్మిన వ్యక్తి వెళ్లిపోతాడు. ఇంట్లోకి తీసుకెళ్లి.. కట్ చేసి చూస్తే.. లోపల సరిగా ఉండదు. ఇక సరైన భాగం కోసం.. ఓ యుద్ధం చేసి.. ముక్కలుగా కట్ చేసి తినేస్తాం. అయితే ముందుగానే సరైన పుచ్చకాయను తీసుకుంటే.. అయిపోతుంది. సరైన పండ్లను ఎలా ఎంచుకోవాలి.

పుచ్చకాయను కొనుగోలు చేసే ముందు, పుచ్చకాయ బయట ఉన్న మచ్చలను తనిఖీ చేయండి. పుచ్చకాయను నేలపై ఉంచడం వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. ఉత్తమమైన పుచ్చకాయను ఎంచుకోవడానికి, క్రీమీ-పసుపు లేదా నారింజ, పసుపు-మచ్చల పుచ్చకాయల కోసం చూడండి.

పుచ్చకాయ యొక్క పసుపు భాగం దాని తీపి రుచిని ఇస్తుంది. తేనెటీగలు పరాగసంపర్కం కోసం పువ్వును తాకే సమయాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి అధికంగా పరాగసంపర్కం జరిగిన పుచ్చకాయ తియ్యగా ఉంటుంది. పుచ్చకాయల్లో లింగం కూడా ఉంటుందని మీకు తెలుసా? అవును, పుచ్చకాయలలో మగ(Male Watermelon), ఆడ పుచ్చకాయలు కూడా ఉంటాయి. మగ పుచ్చకాయలు చాలా పొడవుగా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు గుండ్రంగా, దృఢంగా ఉంటాయి. మగ పుచ్చకాయలో నీటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆడ పుచ్చకాయ తిపి ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసేటప్పుడు మీ అవసరాలకు అనుగుణంగా పుచ్చకాయను చూసి కొనండి.

పుచ్చకాయ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీడియం సైజు పుచ్చకాయ ఉత్తమం. చాలా చిన్న, పెద్ద పుచ్చకాయల జోలికి వెళ్లవద్దు. ఎల్లప్పుడూ మీడియం-సైజ్ పుచ్చకాయను ఎంచుకోండి. పుచ్చకాయ తోక భాగం దాని పక్వతను సూచిస్తుంది. కాబట్టి తోక ఆకుపచ్చగా ఉంటే అది త్వరగా తీసినది అని అర్థం. రుచిగా ఉండదని సూచిస్తుంది. తోక భాగం పొడిగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. తినడానికి తియ్యగా ఉంటుంది.

పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, పరిమాణంలో సౌష్టవంగా ఉండే పుచ్చకాయను ఎంచుకోండి. గడ్డలు లేదా కోతలు ఉన్న పుచ్చకాయలను తీసుకోవద్దు. ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో ఆకారంలో ఉన్న పుచ్చకాయను కొనొద్దు. ఎందుకంటే ఆ రకమైన పుచ్చకాయ మీకు తీపి(Sweet)ని ఇవ్వదు.

పుచ్చకాయ మంచి బరువు(Weight)తో ఉంటే, అది తియ్యగా పండినది. అందులో మంచి రసం ఉంటుంది. కాబట్టి మంచి బరువున్న పుచ్చకాయ కోసం చూడండి. శబ్దం ద్వారా మంచి పుచ్చకాయను ఎంచుకోవచ్చు. మీరు పుచ్చకాయను కొట్టినప్పుడు లోతైన శబ్దం వినబడితే, అది మంచి పండిన పుచ్చకాయ అని అర్థం. తక్కువ శబ్దమయితే అది సరిగ్గా పండలేదని సూచిస్తుంది.

పుచ్చకాయపై నల్లటి మచ్చలు.. ఫంగల్ లేదా బ్యాక్టీరియా(Bacteria) సంక్రమణను సూచిస్తాయి. కొంతమంది అమ్మేవాళ్లు.. కొంచెం కట్ చేసి చూపిస్తారు. పులుపు, చేదు వాసన వస్తే ఆ పుచ్చకాయకు దూరంగా ఉండటం మంచిది. పుచ్చకాయ తొక్క లోపలి భాగంలో పొడి గోధుమ రంగు కణజాలం కనిపిస్తే, అది బ్యాక్టీరియా వ్యాధిని సూచిస్తుంది. కాబట్టి అలాంటి పుచ్చకాయను కొనకపోవడమే మంచిది.

WhatsApp channel