Watermelon For Skin : ముఖంపై మురికిపోవాలంటే.. పుచ్చకాయను వాడుకోవచ్చు-beauty tips watermelon for skin care here is how to apply
Telugu News  /  Lifestyle  /  Beauty Tips Watermelon For Skin Care Here Is How To Apply
పుచ్చకాయ
పుచ్చకాయ (unsplash)

Watermelon For Skin : ముఖంపై మురికిపోవాలంటే.. పుచ్చకాయను వాడుకోవచ్చు

26 March 2023, 15:50 ISTHT Telugu Desk
26 March 2023, 15:50 IST

Watermelon For Beauty : పుచ్చకాయను ఎంతో ఇష్టంగా తింటాం. వేసవిలో దొరికే.. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. అంతేకాదు.. మీ చర్మాన్ని పుచ్చకాయతో మెరిసేలా చేసుకోవచ్చు.

పుచ్చకాయ తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు. శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను అందిస్తుంది. చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) సొంతం చేసుకోవచ్చు. వేసవిలో దొరికే పుచ్చకాయలను(Watermelon) తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతారు. శరీరం డీ హైడ్రేషన్(dehydration)కు గురికాకుండా ఉంటుంది. అయితే పుచ్చకాయతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని(Beauty) కాపాడుకోవచ్చు. చర్మం మీద ఉండే.. నలుపును తొలగించి.. ముఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు.

ఒక గిన్నెలో 3 టీస్పూన్ల పుచ్చకాయ జ్యూస్(Watermelon Juice) తీసుకోండి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ శనగపిండి వేసి కలుపుకోవాలి. అనంతరం ఒక టీ స్పూన్ నిమ్మరసం(Lemon Juice) వేసి బాగా కలుపుకోవాలి. పొడి చర్మం, సున్నిత చర్మం ఉంటే.. నిమ్మరసానికి బదులుగా.. పెరుగు(Curd)ను కలపాలి. మిశ్రమం తయారు అయ్యాక.. దూదిని రోజ్ వాటర్(Rose Water)లో ముంచి.. మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. తర్వాత కొంతసేపు మర్దనా చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత.. దీనిపై ఇదే మిశ్రమం మళ్లీ రాసుకోవాలి. ఇలా రెండుసార్లు రాసుకున్న తర్వాత.. మిశ్రమం ఆరిన అనంతరం.. నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే.. ముఖం మీద ఉండే నలుపు, మృతకణాలు(Dead Skin) తొలగిపోతాయి. మీ ముఖం అందంగా కాంతివంతంగా తయారు అవుతుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయండి.

వేసవి(Summer)లో పుచ్చకాయ తినడం మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. తక్కువ ధరలో, రుచికరంగా ఉండే పుచ్చకాయలో శరీరానికి పోషకాలు అనేకం ఉంటాయి. సాధరణంగా వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉన్నందున, దీనిని తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మీ పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. నీరు మీ జీర్ణవ్యవస్థలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

పుచ్చకాయలో ఉంటే విటమిన్ ఏ(Vitamin A), విటమిన్ సీ వల్ల చర్మ ఆరోగ్యం(Skin Health) మెరుగుపడుతుంది. చర్మం కొలాజెన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మీ జుట్టు బలంగా ఉండడంలో దోహదపడుతుంది. అలాగే మీ కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.