Over Sleeping : ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా? జాగ్రత్త-over sleeping or waking up late everyday danger to health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Over Sleeping Or Waking Up Late Everyday Danger To Health

Over Sleeping : ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా? జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Mar 07, 2023 08:04 PM IST

Over Sleeping Problems : నిద్రతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అర్ధరాత్రి దాటినా నిద్రపోరు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. అయితే దీనితో చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

ఆలస్యంగా నిద్ర లేస్తే సమస్యలు
ఆలస్యంగా నిద్ర లేస్తే సమస్యలు (Pexels)

నిద్రతో అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి దాటినా నిద్ర(Sleeping) పోకుండా గడుపుతారు. సెల్ ఫోన్స్ చూడటం, ఏవేవో ఆలోచనలతో నిద్రకు దూరమవ్వడం చేస్తుంటారు. లేట్ నైట్(Late Night) నిద్రపోతారు. దీంతో ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఆలస్యంగా లేస్తే.. అనేక ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. గుండె జబ్బులు(Heart Diseases) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జీవన విధానం సరిగా లేనందున వచ్చే ఊబకాయం, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక రకాలైన జబ్బుల బారిన పడతారు.

ఉదయంపూట ఆలస్యంగా నిద్రలేవడం కారణంగా.. మానసికపరమైన సమస్యలు 30 శాతం ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే.. మానసిక ఆందోళన ఒత్తిడి(Stress), డిప్రెషన్, చిరాకు, కోపం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆలస్యంగా నిద్రలేస్తే.. జీవ గడియారం దెబ్బతిని హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్(Thyroid) వంటి సమస్యలు వస్తాయి. మెదడులో కణాలు కుచించుకుపోతాయి. ఈ కారణంగా మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఆలస్యంగా నిద్రలేచే అలవాటు నుంచి త్వరగా బయటపడాలి. లేకపోతే.. అనేక రకాల సమస్యల బారిన పడతారు. రాత్రిపూట త్వరగా నిద్రించాలి. ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలంపాటు ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారు.

రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర(8 Hours Sleep) సరిపోతుంది. అలా కాకుండా రోజుకు 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే మాత్రం ప్రమాదమే. ఇలాంటి వాళ్లు గుండెపోటు(Heart Attack) ముప్పు 85 శాతం వరకూ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్రపోతే అంతర్గత అవయవాలైన కాలేయం, పేగుల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి కొవ్వు మీ జీవక్రియను దెబ్బతీసి అధిక కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులకు కారణమవుతుందని ఒబెసిటీ జర్నల్‌లోని ఓ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

ఎక్కువగా నిద్రపోతే బరువు పెరుగుతారు. పడుకున్నప్పుడు ఓ మనిషి ఖర్చు చేసే కేలరీలు చాలా తక్కువ. అందువల్ల రోజుకు 9 నుంచి 10 గంటల పాటు పడుకునే వారు మిగతావారితో పోలిస్తే 5 కేజీల బరువు పెరుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

WhatsApp channel

టాపిక్