Mood-boosting Flowers । ఈ పూల సువాసన చూస్తే మీ మూడ్ పెరుగుతుంది!
Mood-boosting Flowers: ఆకర్షణీయమైన పువ్వులు, వాటి సువాసనలు హార్మోన్ల సమతుల్యతకు సహాయపడి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. మరి అవి ఎలాంటి పువ్వులో ఇక్కడ తెలుసుకోండి.
Mood-boosting Flowers: నేటి జీవితంలో మనిషికి ప్రశాంతత అనేది కరువవుతుంది. రోజంతా కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఆఫీసులో, పనిచేసే చోట ఉండే తీవ్రమైన ఒత్తిళ్లతో పాటు, ఇంటికి వస్తే ఇంటికి ఎందుకు వచ్చామా? అన్నంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఒక్కోసారి అన్నింటిని వదిలేసి బుద్ధం శరణం గచ్చామి అని బాట పట్టాలని అనుకునే వారు ఎంతో మంది ఉంటారు. కానీ సాధ్యం కాదు, చావో రేవో ఇక్కడే అనుకొని ఈ ఒత్తిడి ఆందోళనలతో కూడిన జీవితంలోనే మెల్లగా ఎలాగో అలాగే బ్రతికేస్తున్నారు. కానీ ఇంతటి ఫ్రస్ట్రేషన్ లో మనిషి కొన్నిసార్లు వైల్డ్ గా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సమంలోనే పువ్వులను, అందమైన అమ్మాయిలను చూస్తే పరిస్థితిలో మార్పు ఉంటుందని ఏదో సినిమాలో ఒక సందర్భంలో చెప్తారు.
అమ్మాయిలతో ఆందోళన తగ్గుతుంది అనటంలో నిజం ఉందో లేదో కానీ, కొన్ని రకాల పువ్వుల సువాసనలు చూస్తే మాత్రం ఆందోళన కచ్చితంగా తగ్గుతుందట. ఆకర్షణీయమైన పువ్వులు హార్మోన్ల సమతుల్యతకు సహాయపడి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. మరి అవి ఎలాంటి పువ్వులో ఇక్కడ తెలుసుకోండి.
గులాబీలు
గులాబీకి ఉన్న లేలేత సువాసన మీకు తాజాదనపు అనుభూతిని అందిస్తుంది. గులాబీల పరిమళం మిమ్మల్ని సంతోషపరుస్తుంది, మానసిక ఒత్తిడి నుండి విముక్తి చేస్తుంది. దీని వాసన మిమ్మల్ని లోపలి నుండి రిలాక్స్ చేస్తుంది. గులాబీలా వాసన పీలుస్తూ మీరు మంచి అనుభూతికి లోనవుతారు. కేవలం గులాబీల వాసన మాత్రమే కాదు, గులాబీలను చూసినా వాటి అందం మీ మనసుకు ఒక రకమైన సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీ చుట్టూ కొన్ని గులాబీలను ఉంచుకోండి.
లావెండర్
మీ చుట్టూ లావెండర్ పువ్వులు ఉంచుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీ మనస్సును తేలికపరుస్తుంది, మీ మనసులోని అశాంతిని తగ్గిస్తుంది. ఇదే కాకుండా, లావెండర్ పూల సువాసన మీకు రిలాక్స్‌గా అనిపించవచ్చు, నిద్రలేమి వంటి సమస్యలను ఇది తగ్గించగలదు. ఈ విధంగా లావెండర్ పూల సువాసన మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది, మీరు మంచి అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.
మల్లెలు
మల్లెల సువాసనలు మీపై మెత్తగా మత్తు భావాలను కలిగిస్తుంది. మీ మూడ్ పెంచుతుది. మల్లెపూల సువాసన మీ మెదడును ఉత్తేజితం చేస్తుంది, మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఇది మీ హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మనస్సును రిలాక్స్ చేస్తుంది. కాబట్టి మీ మూడ్ బాగాలేనపుడు మల్లెపూల వాసన చూడండి, రిలాక్స్‌గా, ఒత్తిడి లేకుండా ఉండండి. ముఖ్యంగా రాత్రికి మల్లెపూల వాసనలు మీ మంచం చెంత ఉంటే సుఖసంతోషాల ఊయలలు ఊగటం గ్యారెంటీ.
రజనీగంధ
రజనీగంధకు దాని స్వంత ప్రత్యేక సువాసన కలిగిన పుష్పం. ఇది ఎన్నో ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి. రజనీగంధ పరిమళం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, లోపలి నుండి మిమ్మల్ని ప్రశాంతపరుస్తుంది. ఆందోళన భావాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఈ పూలతో చేసిన నూనె తలనొప్పితో సహా అనేక సమస్యలను తగ్గిస్తుం, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, ఈ పువ్వులను మీ చుట్టూ ఉంచుకుని సంతోషంగా ఉండండి.
సంబంధిత కథనం