Food for 40 Years old: మీకు 40 ఏళ్లు దాటాయా? ఈ ఆహారాలకు గుడ్ బై చెప్పండి-mens health tips men dont eat these foods after 40 years age ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food For 40 Years Old: మీకు 40 ఏళ్లు దాటాయా? ఈ ఆహారాలకు గుడ్ బై చెప్పండి

Food for 40 Years old: మీకు 40 ఏళ్లు దాటాయా? ఈ ఆహారాలకు గుడ్ బై చెప్పండి

Anand Sai HT Telugu
May 31, 2023 12:31 PM IST

Food For 40 Years Age People : వయసు పెరిగే కొద్దీ మనం మన ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 40 ఏళ్లు దాటితే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అదే మీకు మంచిది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వయసు పెరిగే కొద్దీ మన జీర్ణవ్యవస్థ పనితీరు కొద్దిగా బలహీనపడుతుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మానుకోండి. 40 ఏళ్లలోపు చాలా మంది పురుషులు ఇప్పుడు గుండెపోటుతో మరణిస్తున్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్(Cholesterol) గుండెపోటుకు ప్రధాన కారణాలు. గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడాలంటే.. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని ఆహారాలను తినొద్దు. అలాంటివి ఏంటో చూద్దాం..

చక్కెర కంటే కృత్రిమ స్వీటెనర్లు చాలా ప్రమాదకరమైనవని మీకు తెలుసా? సుక్రోలోజ్, స్టెవియా వంటివి ఊబకాయం, వివిధ జీవనశైలి(Life Style) వ్యాధులకు దారితీస్తుందని అధ్యయనాలు కూడా చూపించాయి. కృత్రిమ స్వీటెనర్లు తింటే చక్కెర తినాలనే కోరిక ఎక్కువగా పెరుగుతుంది. మీకు 40 ఏళ్లు పైబడి ఉంటే, చక్కెర స్థానంలో బెల్లం, తేనెతో ప్రయత్నించండి.

కాక్టెయిల్(Cocktail) 20 మరియు 30 వయసులలో తాగడం వల్ల పెద్దగా హాని చేయకపోవచ్చు. కానీ 40వ దశకంలో కాక్టెయిల్ తాగడం వల్ల ప్రాణాపాయం ఉంటుంది. దీనిద్వారా చాలా ప్రమాదం. మరోవైపు అధిక ఆల్కహాల్(Alcohol) తీసుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలంటే వారానికి 3 సార్లు రెడ్ వైన్ తాగవచ్చు.

ప్రొటీన్ పౌడర్లు(protein powder) ఆరోగ్యకరమని మీరు అనుకోవచ్చు. కానీ వాటిలో కొవ్వు, కృత్రిమ రుచులు, హైడ్రోజనేటెడ్ నూనెలు పుష్కలంగా ఉంటాయి. 40 ఏళ్లు పైబడిన వారు వాటిని తినేటప్పుడు, అవి కాలేయం, గుండెకు హాని కలిగిస్తాయి. కాబట్టి ఇలా ప్రొటీన్ పౌడర్ తీసుకోకుండా ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తినండి.

కూరగాయల నూనెలు(Vegetable Oil) తరచుగా శుద్ధి చేస్తారు. సోయాబీన్, మొక్కజొన్న, పామాయిల్ అత్యంత ప్రమాదకరమైన నూనెలు. మంచి ఆరోగ్యం కోసం, మీరు వంటలో ఆవాల నూనె, వేరుశెనగ నూనె, ఆలివ్ నూనె, ఇంట్లో తయారుచేసిన నెయ్యి, వెన్నను మితంగా చేర్చవచ్చు.

కొంతమంది నెయ్యికి బదులుగా వనస్పతి ఉపయోగిస్తారు. వెన్నలా కనిపించే కృత్రిమ వెన్న చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ రకమైన వెన్నని కూరగాయల నూనెతో తయారు చేస్తారు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. దీనిద్వారా గుండెకు దారితీసే ధమనులను మూసుకుపోతాయి. 40 ఏళ్లు పైబడిన వారు ఇది తీసుకుంటే, కొలెస్ట్రాల్ స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.

సలాడ్ పైన ఏవైనా యాడ్ చేస్తే.. వాటికి దూరంగా ఉండాలి. కృత్రిమ రంగులు, రకరకాల వాటిని ఉపయోగిస్తారు. మరోవైపు శీతల పానియాలకూ(Cool Drinks) చాలా దూరంగా ఉండాలి. చక్కెర సోడాను ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్(Cancer వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ రకమైన పానీయాలు ఊబకాయాన్ని కలిగిస్తాయి. 40 ఏళ్లు పైబడినవారు పానీయాలకు తప్పక వీడ్కోలు చెప్పాలి.

పిజ్జా, బర్గర్లలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. 40 ఏళ్ల తర్వాత ఈ రకమైన ఆహారాలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె జబ్బులు(Heart Diseases) వచ్చే ప్రమాదం ఉంది. వీటికి కూడా దూరంగా ఉండాలి.

WhatsApp channel