(1 / 6)
చిన్నతనంలో ఊబకాయ సమస్య ఉండటం వల్ల భవిష్యత్తులో చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగి అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే చిన్న వయసులోనే దీనికి పరిష్కరించాలి.
(Unsplash)(2 / 6)
ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. జంక్‌ఫుడ్ చిన్నప్పటినుంచే ఎక్కువగా అలవాటు చేయడం మంచిది కాదు.
(Unsplash)(3 / 6)
సమస్యను పట్టించుకోకుండా ఉండకూడదు. పిల్లలకు కూడా వారికున్న సమస్య సున్నితంగా తెలియజేయాలి. ప్రమాదం గురించే చెబితే వాళ్లు కూడా అర్థం చేసుకుని మంచి ఆహారం తింటారు.
(Unsplash)(4 / 6)
పిల్లలు మీతో ఉన్నప్పుడు మీరు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. మీనుంచే వాళ్లు అన్ని విషయాలు నేర్చుకుంటారని మర్చిపోకండి.
(Unsplash)(5 / 6)
కూరగాయలు తినకపోతే కాస్త సృజనాత్మకత జోడించి వాటిని వివిధ ఆకారాల్లో కట్ చేసి ఇవ్వండి. పండ్లు, పప్పులు ఏవైనా సరే కంటికి ఇంపుగా కనిపించేట్లు అలంకరించండి.
(Unsplash)(6 / 6)
ఆరోగ్యం ఎంత ముఖ్యమో పిల్లలు తెలుసుకునేలా చెప్పాలి. లేదంటే వాళ్లకి ఆ విషయం అర్థమవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఏం తింటే ఏం నష్టం జరుగుతుందో చెబుతూ పోతే తప్పకుండా తినడం మానేస్తారు.
(Unsplash)ఇతర గ్యాలరీలు