Morning Breath । ఉదయం లేవగానే నోరు దుర్వాసనగా అనిపిస్తోందా? కారణం ఇదే!-know what causes morning breath and ways to prevent it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know What Causes Morning Breath And Ways To Prevent It

Morning Breath । ఉదయం లేవగానే నోరు దుర్వాసనగా అనిపిస్తోందా? కారణం ఇదే!

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 07:03 AM IST

ఉదయం లేచిన తర్వాత నోరు చాలా దుర్వాసనగా అనిపిస్తుందా? ఈ పరిస్థితికి కారణాలు ఏమిటో అలాగే ఇందుకు పరిష్కార మార్గాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

Morning Breath
Morning Breath (Unsplash)

ఉదయం లేచిన తర్వాత మీరు గమనిస్తే మీ నోరు దుర్వాసనగా మారినన్నట్లు అనుభూతి కలుగుతుంది. ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు, దాదాపు ప్రతిఒక్కరు ఈ పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు. దీనికి కారణం నోటిలో లాలాజలం లేకపోవడం. మీరు నిద్రిస్తున్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది, దీంతో నోరు పొడిబారుతుంది. ఈ లాలాజలం సాధారణంగా దుర్వాసన కలిగించే కణాలను బయటకు పంపుతుంది. అయితే నిద్రిస్తున్న సమయంలో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోవటంతో నోటిలో బాక్టీరియా పెరిగిపోయి ఉదయం పూట దుర్వాసనగా అనిపిస్తుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి.

కొన్నిసార్లు బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా నోటి దుర్వాసన అలాగే ఉంటుంది. కొన్నిసార్లు బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా నోటి దుర్వాసన అలాగే ఉంటుంది. ఇది వ్యక్తులకు వ్యక్తులకు మధ్య వేరుగా ఉంటుంది. నోటి దుర్వాసన అనేది కొన్ని అనారోగ్య పరిస్థితులు, వ్యక్తి ఆహారపు అలవాట్లు లేదా నోటి సంరక్షణ సరిగ్గా నిర్వహించలేకపోటం తదితర కారణాల చేత సంభవించవచ్చు.

మీరైనా లేదా ఇంకెవరైనా నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఆచరించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

భోజనం తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి

భోజనం చేసిన ప్రతిసారి నోటిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది తిన్న తర్వాత నీరు తాగి తమ పనుల్లో నిమగ్నమైపోతారు. కానీ దాంతాల సందుల్లో, చిగుళ్లలో ఇరుక్కున ఆహారం సమయం గడిచే కొద్దీ నోటి దుర్వాసనను కలిగిస్తుంది. కాబట్టి ఆహారం చేసిన తర్వాత నోటిని పుక్కిలించిడం, నీటితో కడగడమైనా చేయాలి.

రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి

నోటి దుర్వాసనను నివారించాలని కోరుకుంటే ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేసుకోవటం తప్పనిసరి. ఉదయం లేచిన తర్వాత, అలాగే రాత్రి మీరు పడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ దంతాలను బ్రష్ చేయటానికి ప్రయత్నించాలి. మీరు ఇప్పటికే రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తున్నప్పటికీ సమస్యను అనుభవిస్తుంటే, అలాంటి సందర్భంలో రోజుకు కనీసం ఒకసారైనా మౌత్ వాష్ లేదా ఫ్లాసింగ్ చేసుకోండి.

కొన్ని రకాల ఆహారాలు నివారించాలి

వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, ఆల్కహాల్ వంటివి నోటి దుర్వాసనను పెంచుతాయి. మీరు నోటి దుర్వాసనను అధిగమించాలని అనుకుంటే ఈ రకమైన ఆహారాలకి దూరంగా ఉండాలి. ఒకవేళ వీటిని తినకుండా ఉండలేకపోతే వీటికి ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవాలి.

హైడ్రేటెడ్ గా ఉండండి

దుర్వాసనతో నివారించటానికి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా నోరు పొడిబారటం వలన అది దుర్వాసన కలిగిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజులో ఎక్కువ నీరు తాగండి. నీరు మీ నోటిని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది.

చ్యూయింగ్ గమ్

నోటి దుర్వాసనను పోగొట్టడానికి ప్రత్యేకమైన చ్యూయింగ్ గమ్‌లు ఉంటాయి. ఈ చ్యూయింగ్ గమ్‌లలోని మెంథాల్ మీ నోటి సంరక్షణకు సహాయపడటమే కాకుండా దుర్వాసనను దూరం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చూయింగ్ నములుతూ మాట్లాడకండి. చ్యూయింగ్ గమ్ నమిలేకొద్ది అది నోటి దుర్వాసనతో పోరాడుతుంది. ఇదే సమయంలో మీరు ఎదుటివారితో మాట్లాడితే వారికి మీ నుంచి ఆ దుర్వాసన వస్తుంది. కాబట్టి జాగ్రత్త.

మీకు ఈ విషయంలో ఇంకా సహాయం కావాలనుకుంటే మీ దగ్గర్లోని డెంటిస్టులను సంప్రదించండి. తగిన చికిత్సలు అందిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్