రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో!-healthyhearttakecareofyourteethandoralissuesdoctorsexplainsthecause ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో!

రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం ద్వారా ఎన్ని ప్రయోజనాలో!

HT Telugu Desk HT Telugu
Mar 26, 2022 02:58 PM IST

దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీల నివేదిక ప్రకారం, నోరు శుభ్రంగా లేకుంటే, రక్తంలో బ్యాక్టీరియా పేరుకుపోయి శరీరంలో మంటను కలిగిస్తుందని వెల్లడించింది.

brusching
brusching

దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీల నివేదిక ప్రకారం, నోరు శుభ్రంగా లేకుంటే, రక్తంలో బ్యాక్టీరియా పేరుకుపోయి శరీరంలో మంటను కలిగిస్తుందని వెల్లడించింది. చిగుళ్ళలో పేరుకుపోయిన బ్యాక్టీరియా  గుండె జబ్బులకు దారి తీస్తుంది. దీనికి సంబంధించి  వైద్యులు శాస్త్రీయ అంశాలను జర్నల్‌లో సూచించారు. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చిగుళ్లు, దంతాలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. దంతాలు శుభ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ బ్రష్ చేయడం చాలా అవసరమని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండెపోటులే ప్రధాన కారణం. చిగుళ్లలో పేరుకుపోయిన బ్యాక్టీరియా రక్తనాళాల్లోకి చేరి రక్తం గడ్డకట్టేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణలో సమస్య ఏర్పడుతుంది. గుండె సంబంధించిన ఇబ్బందులతో బాధపడేవారికి చిగుళ్ల సమస్యలు ఉంటాయని జర్నల్ వివరించింది . ఈ విషయంపై డాక్టర్ తిలక్ సుబర్ణ మాట్లాడుతూ, "పరిశోధనలు పీరియాంటల్ డిసీజ్.. కార్డియోవాస్కులర్ డిసీజ్ మధ్య సానుకూల సంబంధాన్ని చూపించాయి, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మూడున్నర రెట్లు పెంచుతుందని చెప్పబడింది." అన్నారు. అయితే నోరు, దంతాలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు సలహా ఇస్తున్నారు

దంతాలను ఇలా సంరక్షించుకోండి

- రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలి. మృదువైన  బ్రష్‌తో మీ దంతాలను శుభ్రం చేయండి. ప్రతి నాలుగు నుండి మూడు నెలలకు మీ టూత్ బ్రష్ మార్చండి. దీంతో చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

- బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేయడం మర్చిపోవద్దు.

- వీలైనంత తక్కువ చక్కెర కలిపిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించండి. ఇది దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

- పొగాకు నమలకపోవడమే మంచిది. ధూమపానానికి దూరంగా ఉండటం కూడా మంచిది.

-పళ్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం. దంతాలు బాగుంటే ఆరోగ్యం అన్ని విధాల బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం