Hair Fall Reasons : జుట్టు రాలుతుందా? అందుకు కారణాలు ఇవే కావచ్చు-all you need to know these are the reasons for hair fall and hair loss in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  All You Need To Know These Are The Reasons For Hair Fall And Hair Loss In Summer

Hair Fall Reasons : జుట్టు రాలుతుందా? అందుకు కారణాలు ఇవే కావచ్చు

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 02:33 PM IST

Hair Fall and Hair Loss : వేసవిలో మనం చేసే కొన్ని పొరపాట్లు మనకు తెలియకుండానే జుట్టు రాలడానికి దారితీస్తాయి. ఈ తప్పులు ఏమిటి? ఇది జుట్టు రాలడానికి ఎలా కారణం అవుతుంది? దీని గురించి తెలుసుకుందాం.

జుట్టు రాలడం
జుట్టు రాలడం

సీజన్ల మార్పు జుట్టు నాణ్యత, షైన్‌ను ప్రభావితం చేస్తుంది. ఆ కారణంగా జుట్టు ఆరోగ్యానికి(Hair Health) ఏ ఆహారం తీసుకోవాలి? ఈ సీజన్‌లో ఏ ఉత్పత్తి ఉత్తమం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి అలవాట్లు ఉపయోగించవచ్చు, జుట్టు కుదుళ్లను ఎలా బలోపేతం చేయాలి? లాంటి వాటితో కన్ఫ్యూజ్ అవుతాం. వెంట్రుకలను మెరిసేలా చేయడంలో మనం తికమక పడుతాం.

కొన్నిసార్లు మనం గూగుల్‌లో సెర్చ్ చేసి, యూట్యూబ్‌లో కనిపించే టెక్నిక్‌లను ఫాలో అవుతాం. కానీ ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దానికంటే ఎక్కువ హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. వేసవి(Summer)లో మనం చేసే కొన్ని తప్పుల వల్ల మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది.

నేరుగా సూర్యకాంతి, కలుషిత వాతావరణం(Weather), దుమ్ము, వానలకు జుట్టును బహిర్గతం చేయడం. UV కిరణాలు నేరుగా జుట్టును తాకడం వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. ఇది జుట్టు పొడిబారడంతోపాటు జుట్టు రాలడానికి(Hair Fall) కూడా దారితీస్తుంది. కాబట్టి యూవీ కిరణాల నుంచి జుట్టును కాపాడుకోవడం మంచిది.

ఈత కొట్టడానికి, ఆడుకోవడానికి వేసవి సరైన సమయం. కానీ నీటిలో ఉండే క్లోరిన్ సమ్మేళనం జుట్టుకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఈత(Swimming) కొట్టేటప్పుడు, నీటిలో ఆడుతున్నప్పుడు షవర్ క్యాప్ ధరించండి.

తడి జుట్టు చాలా పెళుసుగా ఉంటుంది. దీన్ని దువ్వుకోవడం వల్ల జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలను మనం తెచ్చుకున్నట్లే.

హీట్ ప్రొటెక్టెంట్లను ఉపయోగించకుండా హీట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది. జుట్టుకు నేరుగా వేడిని ప్రయోగించినప్పుడు, జుట్టుకు బలం, స్థితిస్థాపకతను ఇచ్చే కెరాటిన్ ప్రోటీన్లు విచ్ఛిన్నమవుతాయి. ఇది జుట్టుకు హాని కలిగించవచ్చు.

తలస్నానానికి(Headbath) చాలా వేడి నీటిని ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. వేడి నీరు జుట్టు పొడిబారడానికి కారణమవుతుంది. జుట్టు మరింత డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. వేసవిలో గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించడం గుర్తుంచుకోండి.

వేసవిలో జుట్టు రాలడానికి డీహైడ్రేషన్(dehydration) ప్రధాన కారణం. కొన్నిసార్లు ఒత్తిడి మధ్య నీరు తాగడం మర్చిపోతాం. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ శరీరానికి తగినంత నీరు తీసుకోం. ఇది జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నీరు ఎక్కువగా తాగడమే ఈ సమస్యకు పరిష్కారం. వేసవిలో దాహం తీర్చుకోవడానికి తీపి పానీయాలు తాగుతాం. కానీ చక్కర పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది.

నేటి ఒత్తిడితో కూడిన కాలంలో, మనం తినడానికి పరుగెత్తుతాం. సరిగ్గా తినడానికి సమయం లేకుండా దొరికినది తింటాం. దీంతో జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. ముఖ్యంగా కరకరలాడే స్నాక్స్(Snacks) తినడం వల్ల జుట్టు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆ కారణంగా, ఫోలేట్, విటమిన్ B12, జింక్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.

చర్మం(Skin) వలె, జుట్టు రూట్ లేదా తల చర్మం కూడా పొడిగా మారుతుంది. జుట్టు పొడిబారడం, చుండ్రు(Dandruff) వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది జుట్టు మూలంలో రక్త ప్రసరణను కూడా దెబ్బతీస్తుంది. కొబ్బరినూనె లేదా బాదం నూనెను రాసుకుని మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ డ్రైనెస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది.

రెగ్యులర్ షాంపూ చేయడం, తరచుగా బ్లో-డ్రైయింగ్, హాట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించడం, జుట్టును గట్టిగా లాగడం వంటివి జుట్టు మూలాలను దెబ్బతీస్తాయి. మనం చేసే మరో పొరపాటు ఏమిటంటే, జుట్టు తడిగా ఉన్నప్పుడు కట్టుకోవడం. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. సరైన జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం.

జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణం. ఇది శారీరక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి(Mental Stress) కావచ్చు. ఇది కాకుండా, యాంటిడిప్రెసెంట్స్, NSAID లు, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ మొదలైన అనవసరమైన మందుల వల్ల మన శరీరంలోని వివిధ అవయవాలపై శారీరక ఒత్తిడి కూడా జుట్టు పల్చబడటానికి, జుట్టు రాలడానికి దారితీస్తుంది. మందుల వల్ల జుట్టు రాలడం తాత్కాలికమే కావచ్చు. ఎందుకంటే మనం మందులు మానేసిన తర్వాత అవి మళ్లీ పెరుగుతాయి. కానీ మానసిక ఒత్తిడిని నిర్వహించడం నేర్చుకోవడం ద్వారా జుట్టు సంరక్షణ సాధ్యమవుతుంది.

WhatsApp channel

టాపిక్