Vicky Kaushal| అండర్-19 క్రికెట్ టీమ్‍‌లో విక్కీ కౌశల్.. సోషల్ మీడియాలో వైరల్-vicky kaushal in team india scorecard from u 19 world cup and fans creates memes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vicky Kaushal| అండర్-19 క్రికెట్ టీమ్‍‌లో విక్కీ కౌశల్.. సోషల్ మీడియాలో వైరల్

Vicky Kaushal| అండర్-19 క్రికెట్ టీమ్‍‌లో విక్కీ కౌశల్.. సోషల్ మీడియాలో వైరల్

HT Telugu Desk HT Telugu
Jan 30, 2022 10:50 AM IST

విక్కీ కౌశల్ క్రికెట్ టీమ్ లో సభ్యుడు కాదు, అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అతడు ఆడలేదు సరికదా కనీసం చూడటానికి కూడా వెళ్లలేదు. మరి అతడి పేరు ఎలా స్కోర్ బోర్డుపై కనిపించింది. ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

<p>విక్కీ కౌశల్</p>
విక్కీ కౌశల్ (Hindustan times)

ఇండియా- బంగ్లాదేశ్ మధ్య శనివారం జరిగిన అండర్- 19 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యువభారత్ సంచలన విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లిందిckey. అయితే ఈ మ్యాచ్ జరిగే సమయంలో స్కోరు బోర్డుపై బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పేరు కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విక్కీ కౌశల్ క్రికెట్ టీమ్ లో సభ్యుడు కాదు, అంతేకాకుండా ఈ మ్యాచ్ లో అతడు ఆడలేదు సరికదా కనీసం చూడటానికి కూడా వెళ్లలేదు. మరి అతడి పేరు ఎలా స్కోర్ బోర్డుపై ఎలా కనిపించిందో తెలుసా?

ఇండియన్ అండర్ 19 టీమ్ లో విక్కీ ఓస్త్వాల్, కౌశల్ తాంబే అనే బౌలర్లు ఉన్నారు. వీరిద్దరూ చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేసి బంగ్లాదేశ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్కోరు బోర్డుపై ఈ ఆటగాళ్ల పేర్లు వరుస క్రమంలో విక్కీ..కౌశల్‌గా కనిపించాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు హీరో విక్కీ కౌశల్ ను ట్యాగ్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేశారు. నటుడిగానే కాకుండా క్రికెట్ గ్రౌండ్ లోనూ విక్కీ కౌశల్ అదరగొడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు.

సానుకూలంగా స్పందించిన హీరో..

ఈ మీమ్స్ ను విక్కీ కౌశల్ పాజిటివ్ గా తీసుకున్నారు. నెటిజన్లకు ధన్యవాదాలు చెప్పారు. గత డిసెంబర్ లో చిరకాల ప్రేయసి కత్రినాకైఫ్‌ను పెళ్లాడారు విక్కీ. ప్రస్తుతం ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. మరో వైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు విక్కీ. "గోవింద్ నామ్ మేరా", "ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ"తో పాటు రెండు బాలీవుడ్ సినిమాల్లో విక్కీ కౌశల్ నటిస్తున్నారు.

అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌ను యువభారత్ మట్టికరిపించి 2020 ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఫలితంగా సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ప్రత్యర్థి జట్టును 111 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం 30.5 ఓవర్లలో 112 లక్ష్యాన్ని ఛేదించిది. భారత జట్టులో రఘువంశీ(45), షేక్ రషీద్(26) ఆకట్టుకోగా.. భారత బౌలర్లలో రవికుమార్ 3, విక్కీ ఓస్వాల్ 2, కౌశల్ తాంబే, రఘుంశీ, రాజవర్ధన్ తలో వికెట్ పడగొట్టారు. రవికుమార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. గత ప్రపంచప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతిలో భారత్‌ పరాజయం పాలైంది.

Whats_app_banner

సంబంధిత కథనం