Bigg Boss Vichitra: హీరో రూమ్‌కు వెళ్ల‌నందుకు నా కెరీర్ నాశ‌న‌మైంది - బిగ్‌బాస్ కంటెస్టెంట్ క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌-vichithra recalls her bad casting couch experiences in bigg boss 7 tamil show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Vichitra: హీరో రూమ్‌కు వెళ్ల‌నందుకు నా కెరీర్ నాశ‌న‌మైంది - బిగ్‌బాస్ కంటెస్టెంట్ క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌

Bigg Boss Vichitra: హీరో రూమ్‌కు వెళ్ల‌నందుకు నా కెరీర్ నాశ‌న‌మైంది - బిగ్‌బాస్ కంటెస్టెంట్ క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Published Nov 22, 2023 09:58 AM IST

Bigg Boss Vichitra: ఓ సినిమా షూటింగ్‌లో స్టార్ హీరో త‌న‌ను రూమ్‌కు ర‌మ్మ‌న్నాడ‌ని, అత‌డి ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించినందుకు త‌న కెరీర్‌ను నాశ‌నం చేశాడ‌ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ విచిత్ర తెలిపింది. టాలీవుడ్ స్టార్ గురించే ఆమె ఈ కామెంట్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బిగ్‌బాస్ కంటెస్టెంట్ విచిత్ర
బిగ్‌బాస్ కంటెస్టెంట్ విచిత్ర

Bigg Boss Vichitra: కోలీవుడ్ సీనియ‌ర్ న‌టి విచిత్ర స్టార్ హీరోపై చేసిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. షూటింగ్ కోసం వెళ్లిన తనను క‌నీసం పేరు కూడా ఆడ‌గ‌కుండానే ఓ స్టార్ హీరో రూమ్‌కు ర‌మ్మ‌న్నాడ‌ని, అత‌డి ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించినందుకు కెరీర్‌ను నాశ‌నం చేశాడ‌ని విచిత్ర తెలిపింది.

ప్ర‌స్తుతం బిగ్‌బాస్ త‌మిళ్ సీజ‌న్ 7లో ఓ కంటెస్టెంట్‌గా విచిత్ర కొన‌సాగుతోంది. బిగ్‌బాస్ షోలో భాగంగా త‌న కెరీర్‌లో ఎదురైన చేదు అనుభ‌వాల‌ను హౌజ్‌మేట్స్‌తో పంచుకున్న‌ది. "2000 సంవ‌త్స‌రంలో ఓ సినిమా షూటింగ్ కోసం ఫారెస్ట్ ఏరియా వెళ్లాం. అక్క‌డ మాకు త్రీ స్టార్ హోట‌ల్‌లో విడిది ఏర్పాటుచేశారు. న‌టీన‌టుల కోసం ఏర్పాటుచేసిన పార్టీలో ఆ సినిమా హీరోను క‌లిశాను. అత‌డు నా పేరు కూడా అడ‌గకుండా రాత్రికి రూమ్‌కు వ‌చ్చేయ‌మ‌ని అన్నాడు.

అత‌డి మాట‌లు విని షాక‌య్యాను. అత‌డి ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రినందుకు మ‌రుస‌టి రోజు నుంచి నాకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. తాగొచ్చి నా రూమ్ ముందు ప్ర‌తిరోజు గొడ‌వ చేసేవాడు. ఆ హీరో బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి రోజుకో రూమ్ మార్చా. ఆ హీరోపై అసోసియేష‌న్‌లో కంప్లైట్ ఇచ్చాను. అయినా నాకు న్యాయం జరగలేదు. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత సినిమాల‌కు గుడ్‌బై చెప్పా" అని విచిత్ర తెలిపింది.

ఆ స‌మ‌యంలో తనకు హోట‌ల్ మేనేజ‌ర్ చాలా హెల్ప్ చేశాడని, అప్పుడు మా మధ్య ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసిందని, ఆ హోటల్ మేనేజర్ నే తాను పెళ్లి చేసుకున్నట్లు విచిత్ర తెలిపింది. ఆ హీరో తో పాటు సినిమా పేరు మాత్రం విచిత్ర బిగ్ బాస్ షో లో చెప్పలేదు. ఓ టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరో గురించే విచిత్ర ఈ కామెంట్స్ చేసిన‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Whats_app_banner