Varaha Roopam Video Song: కాంతార నుంచి ‘వరాహ రూపం’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది: చూసేయండి-varaha roopam full video song released from kantara ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varaha Roopam Video Song: కాంతార నుంచి ‘వరాహ రూపం’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది: చూసేయండి

Varaha Roopam Video Song: కాంతార నుంచి ‘వరాహ రూపం’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది: చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 30, 2023 09:16 PM IST

Varaha Roopam Video Song: కాంతార సినిమా నుంచి ‘వరాహ రూపం’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి సంవత్సరం పూర్తయిన సందర్భంగా హొంబాలే ఫిల్మ్స్.. ఈ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. వివరాలివే..

Varaha Roopam Video Song: కాంతార నుంచి ‘వరాహ రూపం’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది: చూసేయండి
Varaha Roopam Video Song: కాంతార నుంచి ‘వరాహ రూపం’ పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది: చూసేయండి

Varaha Roopam Video Song: కాంతార సినిమా గతేడాది సంచలన విజయం సాధించింది. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ తెలుగు, హిందీతో పాటు దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు స్వయంగా కాంతార చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సంప్రదాయాలను చూపిస్తూనే యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఆద్యంతం ఈ సినిమా ఆకట్టుకుంది. దీంతో కాంతార సూపర్ హిట్ సాధించి.. భారీ కలెక్షన్లను దక్కించుకుంది. గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో కాంతర రిలీజ్ కాగా.. నేటికి ఏడాది పూర్తయింది. దీంతో ఈ సందర్భంగా ఓ సర్‌ప్రైజ్‍ను రిలీజ్ చేసింది హొంబాలే ఫిల్మ్స్.

కాంతార రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ పాట పూర్తి వీడియో సాంగ్‍ను ఈ చిత్రాన్ని నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ రిలీజ్ చేసింది. ఈ పాట కన్నడ భాషలో ఉంది. ఇతర భాషల్లో సినిమాను విడుదల చేసినా.. ఆ వెర్షన్‍లలోనూ ఈ పాటను కన్నడలోనే ఉంచేశారు మేకర్స్. దైవత్వంతో.. అద్భుతమైన ట్యూన్‍తో ఉన్న ఈ పాట అందరినీ అలరించింది. అలాగే, ఈ సాంగ్‍లో రిషబ్ శెట్టి ఆడిన భూతకోల నృత్యం కూడా అలరించింది. చివర్లో వచ్చే ఈ వరాహ రూపం సాంగ్.. కాంతార చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.

కంతార చిత్రానికి అజనీశ్ లోకనాథ్ సంగీతం అందించారు. వరాహ రూపం పాటను సాయి విఘ్నేశ్ పాడారు. శశి రాజ్ కావూర్ లిరిక్స్ అందించారు. ఈ పాట దృశ్యకావ్యంలా ఉండటంతో పూర్తి వీడియో సాంగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. అయితే, కాంతార సినిమాకు ఏడాది పూర్తైన సందర్భంగా ఇప్పుడు హొంబాలే ఫిల్మ్స్.. వరాహ రూపం పూర్తి వీడియో సాంగ్‍ను యూట్యూబ్‍లోకి తీసుకొచ్చింది.

‘వరాహ రూపం’ పాటపై వివాదం చెలరేగి కోర్టు వరకు వెళ్లింది. అయితే, చివరికి హొంబాలే ఫిల్మ్స్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది.

కాంతార చిత్రంలో రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్‍గా నటించారు. కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, వినయ్ బిడ్డప్ప కీలకపాత్రలు పోషించారు. కేవలం రూ.20కోట్లలోపు బడ్జెట్‍తో తెరకెక్కిన కాంతార సినిమా అన్ని భాషలు కలుపుకొని ఏకంగా రూ.400కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

కాంతార 2 సినిమాకు కూడా రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నారు. కాంతారకు ప్రీక్వెల్‍గా ఈ మూవీ రానుంది. ప్రస్తుతం కాంతార 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024