Tollywood | ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ కన్నుమూత
లవ్‌స్టోరీ, లక్ష్య లాంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ కన్నుమాశారు. గత కొంతకాలంగా అనారోగ్యం పాలైన ఆయన హైదరాబాద్ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఆయకు ఇద్దరు కుమారెలు, ఓ కుమార్తే ఉన్నారు.
ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారాంగ్(78) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఏషియన్ మల్టిప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేత అయిన ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే.
నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన లవ్‌స్టోరీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పతాకంపై నారాయణ్ దాస్ నారంగ్ నిర్మించారు. అంతేకాకుండా నాగశౌర్యతో లక్ష్య అనే సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్, ధనుష్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ్ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఆయన డిస్ట్రిబూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేశారు. నిర్మాతగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియర్ గ్రూప్ అధినేత గ్లోబల్ సినిమా స్థాపకుడు, ఫైనాన్సియర్‌కూడా ఆయిన ఆయన చలనచిత్రరంగంలో అజాతశత్రువుగా పేరుగాంచారు. తెలంగాణలో పంపిణీదారునిగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ వాణిజ్యమండలి తమ ప్రగాఢసానుభూతి తెలియజేసింది.
నారాయణ్ దాస్ నారంగ్ భౌతికాయాన్ని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకురానున్నారు. ఈరోజు సాయంత్రం 4గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.
సంబంధిత కథనం
టాపిక్