Tamannaah on Marriage: మా పేరెంట్స్ కూడా నా పెళ్లి గురించి అడ‌గ‌లేదు - అభిమానిపై త‌మ‌న్నా సీరియ‌స్‌-tamannaah angry over on a fan for marriage question ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannaah On Marriage: మా పేరెంట్స్ కూడా నా పెళ్లి గురించి అడ‌గ‌లేదు - అభిమానిపై త‌మ‌న్నా సీరియ‌స్‌

Tamannaah on Marriage: మా పేరెంట్స్ కూడా నా పెళ్లి గురించి అడ‌గ‌లేదు - అభిమానిపై త‌మ‌న్నా సీరియ‌స్‌

HT Telugu Desk HT Telugu
Sep 06, 2023 01:11 PM IST

Tamannaah on Marriage: పెళ్లి గురించి ఓ ఈవెంట్‌లో అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు త‌మ‌న్నా సీరియ‌స్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కు మా అమ్మ‌నాన్న కూడా పెళ్లి గురించి త‌న‌ను ప్ర‌శ్నించ‌లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

తమన్నా, విజయ్ వర్మ
తమన్నా, విజయ్ వర్మ

Tamannaah on Marriage: యాక్ట‌ర్ విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా ప్రేమ‌లో ఉన్న‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.వీరిద్ద‌రు డేటింగ్ చేస్తున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ డేటింగ్ వార్త‌ల‌పై త‌మ‌న్నాతో పాటు విజ‌య్ వ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇటీవ‌లే జైల‌ర్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో పెద్ద విజ‌యాన్ని అందుకున్న‌ది త‌మ‌న్నా.ఈ స‌క్సెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉంది త‌మ‌న్నా.

ఇటీవ‌ల చెన్నైలో జ‌రిగిన ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో త‌మ‌న్నా పాల్గొన్న‌ది. ఈ ఈవెంట్‌లో భాగంగా అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా మీ పెళ్లి ఎప్పుడు? త‌మిళ అబ్బాయిని పెళ్లి చేసుకునే అవ‌కాశం ఉందా? అని ఓ ఫ్యాన్ త‌మ‌న్నాను ప్ర‌శ్న అడిగాడు. పెళ్లి ప్ర‌శ్న‌కు త‌మ‌న్నా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కు మా అమ్మ‌నాన్న‌లు కూడా పెళ్లి గురించి తనను ఎప్పుడు ఇలా డైరెక్ట్‌గా ప్ర‌శ్న అడ‌గ‌లేదు అంటూ ఆ అభిమానిపై సీరియ‌స్ అయ్యింది. మీరు కోరుకున్న ల‌క్ష‌ణాలున్నవ్య‌క్తి మీ జీవితంలోకి వ‌చ్చాడా అని అడిగిన ప్ర‌శ్న‌కు త‌మ‌న్నా తెలివిగా స‌మాధానం ఇచ్చింది.

జీవితం సాఫీగా సాగిపోతుంద‌ని, చాలా సంతోషంగా ఉన్నానంటూ బ‌దులిచ్చింది. విజ‌య్ వ‌ర్మ పేరును మాత్రం దాట‌వేసింది. జైల‌ర్ తో పాటు తెలుగులో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన భోళాశంక‌ర్ మూవీ ఒక రోజు గ్యాప్‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా మాత్రం డిజాస్ట‌ర్‌గా నిల‌వగా జైల‌ర్ ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

టాపిక్