RGV Saree Movie: ఆర్‌జీవీ శారీ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ - హీరోయిన్‌గా సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ శ్రీల‌క్ష్మి స‌తీష్‌-social media sensation srilaxmi sateesh to make his hollywood debut with rgv saree movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv Saree Movie: ఆర్‌జీవీ శారీ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ - హీరోయిన్‌గా సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ శ్రీల‌క్ష్మి స‌తీష్‌

RGV Saree Movie: ఆర్‌జీవీ శారీ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ - హీరోయిన్‌గా సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ శ్రీల‌క్ష్మి స‌తీష్‌

Nelki Naresh Kumar HT Telugu
Published Dec 21, 2023 02:57 PM IST

RGV Saree Movie: ఇంట‌ర్నేష‌న‌ల్ శారీ డే రోజున రామ్‌గోపాల్ వ‌ర్మశారీ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ శ్రీల‌క్ష్మి స‌తీష్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.

శ్రీల‌క్ష్మి స‌తీష్
శ్రీల‌క్ష్మి స‌తీష్

RGV Saree Movie: రామ్ గోపాల్ వ‌ర్మ ఏది చేసిన వెరైటీగానే ఉంటుంది. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్స్‌తో త‌న సినిమాల‌పై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని క‌లిగించ‌డంలో వ‌ర్మ త‌ర్వాతే ఎవ‌రైనా. తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ శారీ డేను పుర‌స్క‌రించుకొని రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌చేశాడు. శారీ పేరుతో ఓ సినిమాను రూపొందించాడు. అయితే ఈ సినిమాకు రామ్‌గోపాల్ వ‌ర్మ కేవ‌లం ప్రొడ్యూస‌ర్‌గానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

అఘోష్ వైష్ణ‌వం శారీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శారీ సినిమాతో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ శ్రీల‌క్ష్మి స‌తీష్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో శ్రీల‌క్ష్మి స‌తీష్‌ చేసిన కొన్ని వీడియోలు, రీల్స్ వైర‌ల్‌గా మార‌డంతో ఆమెకు హీరోయిన్‌గా అవ‌కాశం ఇస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఆ మాట‌ను శారీ సినిమాతో నిల‌బెట్టుకోనున్నాడు.

శ్రీల‌క్ష్మి స‌తీష్ పేరును ఆమె త‌ల్లి ఆరాధ్య దేవిగా మార్చిన‌ట్లు వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. అతి ప్రేమ ఎలాంటి అన‌ర్థాల‌కు దారితీస్తుంద‌న్న‌ది శారీ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు వ‌ర్మ తెలిపాడు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా శారీ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్లు చెప్పాడు. శారీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న పొలిటికిల్ మూవీ వ్యూహం నెల రోజుల గ్యాప్‌లోనే రెండు పార్టులుగా రిలీజ్ కాబోతోంది. వ్యూహం పార్ట్ 1 డిసెంబ‌ర్ 29.వ్యూహం -2 జ‌న‌వ‌రి 25న రిలీజ్ కానున్నాయి.

Whats_app_banner