Nikhil 18 Pages Movie: నిఖిల్ సినిమాలో పాట పాడ‌నున్న కోలీవుడ్ స్టార్ హీరో-simbu croons energetic song for nikhil 18 pages movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Simbu Croons Energetic Song For Nikhil 18 Pages Movie

Nikhil 18 Pages Movie: నిఖిల్ సినిమాలో పాట పాడ‌నున్న కోలీవుడ్ స్టార్ హీరో

Nelki Naresh Kumar HT Telugu
Nov 26, 2022 02:07 PM IST

Nikhil 18 Pages Movie: నిఖిల్ హీరోగా న‌టిస్తోన్న 18 పేజేస్ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో పాట పాడ‌బోతున్నాడు. ఆ హీరో ఎవ‌రంటే...

నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌
నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

Nikhil 18 Pages Movie: శింబులో న‌టుడితో పాటు మంచి గాయ‌కుడు ఉన్నాడు. ది వారియ‌ర్‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో అత‌డు పాడిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. నిఖిల్ హీరోగా న‌టిస్తోన్న 18 పేజేస్ సినిమాలో శింబు ఓ పాట పాడ‌బోతున్నాడు. టై ఇవ్వు పిల్ల టైం ఇవ్వు అనే లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ పాట‌కు శింబు వాయిస్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్న‌ది. త్వ‌ర‌లోనే ఈ సాంగ్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. కార్తికేయ -2 స‌క్సెస్ త‌ర్వాత నిఖిల్, అనుమ‌ప ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తున్న‌ సినిమా ఇది. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌థ‌ను అందిస్తున్నాడు.

కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య‌ప్ర‌తాప్ ప‌ల్నాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డిసెంబ‌ర్ 23న 18 పేజేస్ సినిమాను రిలీజ్ కానుంది. జీఏ2 పిక్చ‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా కార్తికేయ -2 సినిమాతో పాన్ ఇండియ‌న్ స్థాయిలో పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు నిఖిల్‌.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా 120 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. కార్తికేయ‌-2 సినిమాకు బాలీవుడ్‌లో న‌ల‌భై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. కార్తికేయ -2 హిట్ 18 పేజేస్‌కు బాగా క‌లిసివ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాపై క్రేజ్ నెల‌కొన్న‌ట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

టాపిక్