shruti haasan: సినిమా ఆఫర్ల కోసం తండ్రి పేరును ఎప్పుడూ వాడుకోలేదు: శృతిహాసన్
పదమూడేళ్ల ప్రయాణంలో సినిమా ఆఫర్ల కోసం ఏ రోజు తల్లిదండ్రులపై ఆధారపడలేదని చెప్పంది శృతిహాసన్. తండ్రి పేరును ఎప్పుడూ రిఫరెన్స్ గా ఉపయోగించలేదని పేర్కొన్నది.
కమల్‌హాసన్ తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శృతిహాసన్. 2009లో విడుదలైన బాలీవుడ్ చిత్రం లక్ తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.తొలి సినిమా పరాజయంతో ఆమెకు పెద్దగా లక్ కలిసిరాలేదు. కెరీర్ ఆరంభంలో ఆమె నటించిన పలు సినిమాలు పరాజయాలుగా నిలవడంతో ఐరెన్‌లెగ్‌గా ముద్రపడింది. అయినా విమర్శలను పట్టించుకోకుండా ప్రతిభాపాటవాలతో కథానాయికగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. గబ్బర్‌సింగ్ ,బలుపు, రేసుగుర్రం, శ్రీమంతుడుతో పాటు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలపై శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
కమల్ హాసన్ కూతురిని కావడం వల్లనే ఇండస్ట్రీల్లోకి సులభంగా ఎంట్రీ ఇవ్వగలిగానని, ఆ వాస్తవాన్ని తాను ఎప్పడూ కాదనలేదని చెప్పింది. వారసత్వం అనేది ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఇండస్ట్రీలో స్థిరంగా రాణించాలంటే ప్రతిభ ఒక్కటే మార్గమని చెప్పింది. తొలి సినిమా నుండి నేటి వరకు తాను ఏ రోజు ఫాదర్ రిఫరెన్స్ ను వాడుకోలేదని చెప్పింది. హీరోయిన్ గా అవకాశాలు ఇప్పించమని, నన్ను రిఫర్ చేయమని నాన్న కమల్ హాసన్ ను అడగలేదని తెలిపింది. ఆర్థిక పరమైన అవసరాల విషయంలో తల్లిదండ్రులపై ఆధారపడటం తనకు ఇష్టం లేదని పేర్కొన్నది.
చిన్నతనం నుండే సొంతకాళ్లపై నిలబడటం అలవాటు చేసుకున్నానని చెప్పింది. ప్రస్తుతం శృతిహాసన్ చిరంజీవి 154వ సినిమాతో పాటుగా బాలకృష్ణ 107 సినిమాలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ సలార్ లో కీలక పాత్ర పోషిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్